మిస్ వరల్డ్-2025 పోటీలు.. చార్మినార్ సహా 10 ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం..!
ఇదే క్రమంలో సందర్శకుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ మరియు పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను రెండు రోజుల క్రితం పోలీసులు హ్యాకర్లతో సమావేశం నిర్వహించి అన్ని థెల బందీలను మూసివేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఈ రోజు చారిత్రాత్మక కట్టడం చార్మినార్ నుంచి..

తెలంగాణలో త్వరలోనే మిస్ వరల్డ్ పోటీలు జరగబోతున్నాయి. ఇప్పటివరకు ప్రపంచ దేశాలకే సొంతం అనుకున్న ఈ పోటీలు ఇప్పుడు మన రాష్ట్రం వరకు వచ్చేశాయ్. ప్రపంచ అందగత్తెల పోటీలంటే ప్రతిష్ట్మాత్మకమైన ఘట్టం ఆవిష్కృతమవనుందని, అది రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలోనే సాధ్యపడిందని కొందరు పొగుడుతుంటే, మరోవైపు ఎందుకొచ్చిన అందాల పోటీలంటూ దేనికి ఉపయోగమని విమర్శించే వారు కూడా లేకపోలేదు. పరిస్థితి ఇలా ఉండగా.. మిస్ వరల్డ్ పోటీలను దృష్టిలో ఉంచుకుని చారిత్రాత్మక కట్టడమైన చార్మినార్ పరిసర ప్రాంతాల్లో దుకాణాలను, వ్యాపార సముదాయాలను మూసివేస్తున్నారు.
హైదరాబాద్ నగరం పాతబస్తీలోని చౌమొహల్లా ప్యాలెస్(ఖిల్వత్ ప్యాలెస్)లో మే 31 నుంచి మిస్ వరల్డ్-2025 పోటీలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు హైదరాబాద్ సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ మరియు పరిసర ప్రాంతాల నుంచి అన్ని థెల బందీలను తొలగించే చర్యలు చేపట్టారు. ఇదే క్రమంలో సందర్శకుల భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని సౌత్ జోన్ పోలీసులు చార్మినార్ మరియు పాతబస్తీలోని ఇతర ప్రాంతాలలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇందుకు గాను రెండు రోజుల క్రితం పోలీసులు హ్యాకర్లతో సమావేశం నిర్వహించి అన్ని థెల బందీలను మూసివేయాలని అభ్యర్థించారు. ఈ క్రమంలోనే ఈ రోజు చారిత్రాత్మక కట్టడం చార్మినార్ నుంచి అన్ని థెల బందీలను హ్యాకర్లు మూసివేశారు. ఇది కొంతవరకు వ్యాపారస్తులకు నష్టం కలిగించే చర్యలే అయినా భద్రతా పరిణామాల దృష్ట్యా తప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. వ్యాపారులు సైతం దీనిపై విముఖంగానే ఉన్నా ప్రభుత్వం, పోలీస్ శాఖ చర్యలకు అడ్డు చెప్పలేక మౌనం వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కాగా, చార్మినార్ మరియు చౌమొహల్లా ప్యాలెస్ సమీపంలోని పాతబస్తీలో సౌత్ జోన్ పోలీసులు విదేశీయులకు అన్ని రకాలైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. మరోవైపు, మిస్ వరల్డ్-2025 పోటీల కోసం విదేశీయులు హైదరాబాద్‌కు రావడం మొదలైంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి అందగత్తెలు, మాజీ మిస్ వరల్డ్‌లు హైదరాబాద్ నగరానికి విచ్చేశారు. త్వరలోనే జరగబోతున్న పోటీల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..




