Hyderabad: అక్షయ్ కుమార్ ఆత్మహత్య వెనకున్న మిస్టరీ ఏంటీ..? హైదరాబాద్‌లో రాజకీయ ప్రకంపనలు..

హైదరాబాద్‌లో ఓ యువకుడి సూసైడ్‌ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంతకీ, ఆ యువకుడి ఆత్మహత్యకు పాలిటిక్స్‌కు లింకేంటి? సూసైడ్‌ వెనకున్న మిస్టరీ ఏంటి?

Hyderabad: అక్షయ్ కుమార్ ఆత్మహత్య వెనకున్న మిస్టరీ ఏంటీ..? హైదరాబాద్‌లో రాజకీయ ప్రకంపనలు..
Hyderabad Crime News
Follow us

|

Updated on: Nov 22, 2022 | 8:09 AM

Minister Srinivas Goud PA son suicide: హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఓ యువకుడి సూసైడ్‌ కలకలం రేపుతోంది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ దగ్గర గతంలో పీఏగా పనిచేసిన దేవేందర్‌ కుమారుడు అక్షయ్‌ బలవన్మరణానికి పాల్పడటం అనుమానాలు రేకెత్తించింది. హైదరాబాద్ కొండాపూర్‌ సెంట్రల్‌ పార్క్‌లో నివాసముంటోన్న అక్షయ్‌ కుమార్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. అయితే, సూసైడ్‌ చేసుకున్న అక్షయ్‌పై క్రిమినల్‌ కేసు ఉండటం, అతని తండ్రి.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ దగ్గర PAగా పనిచేసి ఉండటంతో ఆత్మహత్యపై పలు అనుమానాలు చెలరేగాయి. సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఆత్మహత్య చేసుకున్న అక్షయ్‌.. పది రోజుల క్రితమే ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా చేరినట్టు చెబుతున్నారు పోలీసులు. అంతేకాదు, అక్షయ్‌పై ఓ క్రిమినల్‌ కేసు కూడా ఉందని వెల్లడించారు. అయితే, అక్షయ్‌ సూసైడ్‌కి కారణాలేంటో బయటికి రాలేదు. ఇంట్లో ఎలాంటి సూసైడ్‌ నోట్‌ దొరకకపోవడంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

అక్షయ్‌పై అనేక ఆరోపణలు వినిపిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.. అక్షయ్‌ తండ్రి.. మంత్రి దగ్గర పీఏగా పనిచేస్తున్నప్పుడు మోసాలకు పాల్పడినట్లు టాక్‌ వినిపిస్తోంది. ఆ నేరాల్లో నమోదైన కేసు కారణంగానే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇవి కూడా చదవండి

సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..