FTCCI Awards: మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకున్న మై హోమ్ గ్రూప్‌.. ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డు

| Edited By: Shaik Madar Saheb

Jul 03, 2023 | 2:16 PM

మై హోమ్‌ గ్రూప్‌ గ్రూప్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్న మై హోమ్‌ గ్రూప్‌కు ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ అవార్డు వరించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) ఆదివారం పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రకటించింది...

FTCCI Awards: మరో ప్రతిష్టాత్మక గౌరవాన్ని దక్కించుకున్న మై హోమ్ గ్రూప్‌.. ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డు
My Home
Follow us on

మై హోమ్‌ గ్రూప్‌ మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకుంది. నిర్మాణ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకొని, వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటున్న మై హోమ్‌ గ్రూప్‌కు ప్రతిష్టాత్మక ఎఫ్‌టీసీసీఐ అవార్డు వరించింది. ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ)  పారిశ్రామికవేత్తలకు అవార్డులను ప్రకటించింది. మొత్తం 22 విభాగాల్లో ఎఫ్‌టీసీసీఐ ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రధానం చేయనున్నారు.

‘ఎక్సలెన్స్‌ ఇన్‌ కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ’ విభాగంలో మైహోమ్‌ ఇండస్ట్రీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ నొవాటెల్‌లో సోమవారం ఈ కార్యక్రమం జరగనుంది. వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సాయంత్రం 4 గంటలకు  అవార్డును ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గ్రీన్‌కో గ్రూప్‌ ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌, ఎండీ అనిల్‌ కుమార్‌ గౌరవ అతిథులుగా హాజరుకానున్నారు.

ఇదిలా ఉంటే మొత్తం 22 విభాగాల్లో ఎక్సలెన్స్‌ అవార్డులను ప్రధానం చేయనున్నారు. మొత్తం 23 విభాగాలకు నామినేషన్లు కోరగా 22 విభాగాల్లో దరఖాస్తులు అందాయని ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు అనిల్‌ అగర్వాల్‌ తెలిపారు. మై హోమ్‌ ఇండస్ట్రీస్‌తో పాటు.. ఆల్‌రౌండ్‌ పెర్‌ఫార్మెన్స్‌ అవార్డుకు మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎగుమతుల విభాగంలో నవ లిమిటెడ్‌ ఎక్సలెన్స్‌ అవార్డులు దక్కాయి.

ఇవి కూడా చదవండి

Jupally Rameswar Rao, Founder-Chairman of My Home Group

మై హోమ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిష్టాత్మకమైన డైవర్సిఫైడ్ మై హోమ్ గ్రూప్‌ 10 మిలియన్ TPAతో దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సిమెంట్ తయారీలో ఒకటిగా నిలిచింది.

బాధ్యతాయుతమైన కార్పొరేట్ సంస్థంగా మై హోమ్ గ్రూప్‌ ఎల్లప్పుడూ కార్పొరేట్ సామాజిక బాధ్యతకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. ఈ క్రమంలోనే మై హోమ్ ఒక అద్భుతమైన బ్రాండ్‌గా మారింది. మేలైన, పర్యావరణానికి అనుకూలమైన సిమెంట్ ఉత్పత్తులను అందించడమే కాకుండా, గోల్డ్, ప్లాటినం రేటెడ్ గృహ, వాణిజ్య ప్రాజెక్టులను నిర్మిస్తోంది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా మై హొం ఇండస్ట్రీస్ ఇప్పటి వరకు చేపట్టిన పలు కార్యక్రమాలు..

– కార్పొరేట్ సామాజిక బాధ్యతల రూపంలో సమాజ శ్రేయస్సును నిరంతరం మెరుగుపరచాలనే నిబద్ధతతో నడుస్తోంది.

– వైద్య శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు, పశువైద్య శిబిరాలు, మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలు, గ్రామాల్లో ఆరోగ్యవంతమైన తాగునీటిని అందించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ & పారిశుధ్యం లాంటి పనులు ఎన్నో చేపడుతోంది.

Jupally Rameswar Rao, Founder-Chairman of My Home Group

– సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు, గ్రామీణ ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించడం ద్వారా ఇన్‌ఫ్రా నిర్మాణం చేపడుతోంది.

– రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు నిధులను విరాళంగా అందించడం ద్వారా విపత్తు నిర్వహణలోనూ భౌతికంగా, ఆర్థికంగా సహాయం అందిస్తూ.. కీలక పాత్ర పోషిస్తోంది.

– ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించడం ద్వారా నైపుణ్యాభివృద్ధి & విద్య, నిరుద్యోగ విద్యావంతులైన యువతకు వారి ఉపాధిని మెరుగుపరచడానికి నైపుణ్యాభివృద్ధి శిక్షణ, పాఠశాలల్లో లైబ్రరీలను అందించడం, నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు అందిస్తోంది.

తాజాగా FTCCI అదిస్తోన్న ఈ ప్రతిష్టాత్మక అవార్డుతో.. మరింత శక్తివంతంగా ముందుకు సాగనుందని సంస్థ ప్రకటించింది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..