AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కేంద్రంలో ఉంది ఎన్డీఏ కాదు.. NPA .. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు

Hyderabad: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) ట్విటర్‌ (Twitter) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ అసమర్థ పాలన దేశంలోని..

Hyderabad: కేంద్రంలో ఉంది ఎన్డీఏ కాదు.. NPA .. మరోసారి కేంద్ర ప్రభుత్వంపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు
Minister Ktr
Surya Kala
|

Updated on: Apr 19, 2022 | 12:13 PM

Share

Hyderabad: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌(Minister KTR) ట్విటర్‌ (Twitter) వేదికగా కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ అసమర్థ పాలన దేశంలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. అనేకాదు దేశంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందని.. ద్రవ్యోల్బణం తీవ్రస్తాయిలో పెరిగిందని అన్నారు. 45 ఏళ్ల గరిష్ఠానికి నిరుద్యోగం చేరుకుంటే.. 30 ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం పెరిగిందన్నారు. ఇక ఇప్పటి వరకూ దేశంలో ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి పెట్రోల్, డీజిల్ ధరలు చేరుకున్నాయనున్నారు.

ఇక ఎల్పీజీ సిలిండర్ ధరలు ప్రపంచంలోనే ఎక్కడా లేనంత అధికంగా ఉన్నయని కేటీఆర్ విమర్శించారు.  మరోవైపు   వినియోగదారుల నమ్మకాన్ని కోల్పోతున్నామని ఆర్బీఐ తెలిపిందని… ఇలాంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమని పిలవన్నారు. అంతేకాదు కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వమని పిలవాలా? లేక ఎన్పీఏ ప్రభుత్వమని పిలవాలా అని ప్రశ్నించారు. ఎన్డీఏ పని చేయని ప్రభుత్వంగా ( NPA = నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) మిగిలిపోతుందంటు తీవ్ర విమర్శలు చేశారు మంత్రి కేటీఆర్.

మరోవైపు విశ్వహిందూ పరిషత్  చట్టానికి అతీతమా అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అన్నారు. జహంగీర్‌పురిలో హనుమాన్ జయంతి ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాకాండకు సంబంధించి తమ కార్యకర్తలపై ఏదైనా చర్య తీసుకుంటే ఢిల్లీ పోలీసులపై యుద్ధం చేస్తామని VHP బెదిరించినట్లు వచ్చిన నివేదికపై ఆయన స్పందించారు. ఢిల్లీ పోలీసులపై వీహెచ్ చేస్తోన్న వ్యాఖ్యలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా ఆయన ప్రశ్నించారు. “ఈ కుర్రాళ్ళు దేశ చట్టానికి అతీతులా?” అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ ద్వారా ప్రశ్నించారు.

Also Read: JC Prabhakar Reddy: చిన్నారి మృతితో కూడా రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడిన జేసి