Minister KTR: “నూకలు తినండని అవమానించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి”.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్..

|

Oct 22, 2022 | 6:12 PM

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని, అందుకే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేసుకుని,...

Minister KTR: నూకలు తినండని అవమానించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ఫైర్..
Ktr
Follow us on

కేంద్ర ప్రభుత్వ తీరుపై తెలంగాణ మంత్రి కేటీఆర్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి కేంద్రం ఓర్వలేకపోతోందని, అందుకే నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. మిషన్ కాకతీయ పథకంతో చెరువులను బాగు చేసుకుని, ఫ్లొరోసిస్ ను రూపుమాపామన్నారు. రంగారెడ్డి జిల్లా మన్నెగూడలో ఏర్పాటు చేసిన లారీ యజమానులు, డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన మంత్రి కేటీఆర్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ మూడున్నరకోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి చేసే స్థాయికి చేరుకుందని, అందరి అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని వెల్లడించారు. ప్రపంచంలోని ముఖ్య నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడుతోందని, కుల, మత తేడా లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2014 లో క్రూడాయిల్‌ ధర 94 డాలర్లు, ప్రస్తుతం ధర 98 డాలర్లుగా ఉందన్న కేటీఆర్.. అయినా అప్పుడు లీటరు పెట్రోల్‌ ధర రూ.70లు ఉండేదని, కానీ ఇప్పుడు లీటరు పెట్రోలు ధర రూ.112కు చేరిందన్నారు. ముడి చమురు ధర పెరగలేదు కానీ, మోడీ చమురు ధర పెరుగుతోందని ఎద్దేవా చేశారు.

ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెట్రోల్‌, డీజిల్‌పై విధించిన సెస్ ను రద్దు చేయాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. నూకలు తినండని తెలంగాణ ప్రజలను కేంద్రం అవమానించింది. మనల్ని అమానించిన వారి తోకలు కత్తిరిద్దామా?వద్దా?. తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి. పారిశ్రామిక వేత్తల నుంచి కార్మికులు, శ్రామికుల బాగోగులు చూస్తున్నాం. ఉద్యమంలో ఉన్న సమయంలో తెలంగాణ వస్తే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే నాయకత్వం ఉందా అని అడిగేవారు. కానీ ఇప్పుడు వాళ్ల నోళ్లు మూతబడ్డాయి. ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొని, హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనం.

– కేటీఆర్, తెలంగాణ మంత్రి

ఇవి కూడా చదవండి

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. పరిశ్రమలకు, వ్యవసాయానికి, గృహ వినియోగానికి నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నామని, తాగునీటి సమస్య పరిష్కరించామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టును కట్టామని, పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..