Rain Alert: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు.. రానున్న రెండు రోజుల్లో వానలే వానలు

|

Jul 21, 2022 | 12:17 PM

వర్షాలు, వరదలు ఆగి ఇంకా వారమైనా కాలేదు. అప్పుడే తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు. రానున్న రెండు రోజులు తెలంగాణ (Telangana), కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు...

Rain Alert: బీ అలర్ట్.. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న ముప్పు.. రానున్న రెండు రోజుల్లో వానలే వానలు
Telangana Rains
Follow us on

వర్షాలు, వరదలు ఆగి ఇంకా వారమైనా కాలేదు. అప్పుడే తెలుగు రాష్ట్రాలపై మరోసారి వరుణుడు గర్జించనున్నాడు. రానున్న రెండు రోజులు తెలంగాణ (Telangana), కోస్తా, రాయలసీమల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలపై ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోందన్న అధికారులు.. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశముందని చెప్పారు. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గురు, శుక్రవారాల్లో తెలంగాణలో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓమోస్తరు వానలు పడతాయి. గురువారం అక్కడక్కడ తేలికపాటి వర్షం పడనుంది. కాగా.. బుధవారం కామారెడ్డి జిల్లా లింగంపేట్‌లో అత్యధికంగా 33.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తెలంగాణలోని 27 జిల్లాల్లో 60 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఇప్పుడిప్పుడే వరద ముప్పు నుంచి బయటపడుతున్న ప్రజలను వాతావరణశాఖ అధికారుల హెచ్చరికలు భయాందోళన కలిగిస్తున్నాయి.

ఇక ఇప్పటికే తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు వంకలు ప్రమాదకరంగా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీటితో ప్రాజెక్టులు, జలాశయాలు, చెరువులు నిండుకుండల్లా మారి ప్రమాదకరంగా మారాయి. ఇలా నిర్మల్ జిల్లాలో కడెం ప్రాజెక్ట్ కు భారీ వరదనీరు చేరి ప్రమాద ఘంటికలు మోగించింది. కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండానే వరద ప్రవాహం తగ్గడంతో స్థానిక ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

భారీ వర్షాలు, వాగులు ఉప్పొంగడం, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి ఆంధ్రప్రదేశ్ లోని సాగరసంగమం వరకు పరీవాహక ప్రాంతాలను నిండా ముంచింది. మంచిర్యాల, మంథని, చర్ల, భద్రాచలం, ధవళేశ్వరం, లంక గ్రామాలను వరదతో ముంచెత్తింది. భద్రాచలం వద్ద ఒకానొక దశలో నీటిమట్టం 70 అడుగులు దాటింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి