Wine Shop Fire Accident: వైన్స్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం.. 10 లక్షల ఆస్తి నష్టం.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి..

Wine Shop Fire Accident: ఓ వైన్స్‌ షాపులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బొల్లారం వద్ద ఉన్న సాయిరాం వైన్స్‌ షాపులో...

Wine Shop Fire Accident: వైన్స్‌ షాపులో భారీ అగ్ని ప్రమాదం.. 10 లక్షల ఆస్తి నష్టం.. మూడు ఫైరింజన్లతో మంటలు అదుపులోకి..
Massive Fire At Wine Shop .. 10 Lakh Property Damage

Updated on: Mar 12, 2021 | 1:47 PM

Wine Shop Fire Accident: ఓ వైన్స్‌ షాపులో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ బొల్లారం వద్ద ఉన్న సాయిరాం వైన్స్‌ షాపులో జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.10 లక్షలు ఆస్తినష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అందరూ చూస్తుండగా వైన్స్‌ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో గమనించిన కొందరు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. అయితే మంటల ధాటికి వైన్స్‌ షాపులో మద్యం సీసాలు పగిలి చెల్లాచెదురైపోయాయి. ఘటన స్థలంలో మూడు అగ్నిమాపక శకటాలు మంటలను అదుపులోకి తీసుకువచ్చాయి. అయితే విద్యుత్‌ షార్ట్ సర్య్కూట్‌ కారణంగా అగ్ని ప్రమాదం జరిగిందా..?లేక మరేదైన కారణంగా ప్రమాదం జరిగిందా..? అనే కోణంలో పరిశీలిస్తున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు.

కాగా, ఈ మధ్యకాలంలో నగరంలో చాలా ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కార్యాలయాలు, కంపెనీలు, గోడౌన్‌లలో ఇలా అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు సంభవిస్తూ లక్షల్లో ఆస్తినష్టం జరుగుతోంది. షార్ట్‌ సర్క్యూట్‌, ఇతర కారణాలతో ఇలా ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేది ఎండా కాలం.. మరిన్ని అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. దీంతో ప్రతిరోజు కార్యాలయాలు గానీ, పరిశ్రమలు, దుకాణాలు, ఇతర ఏ రంగాలైనా సరే ఎప్పటికప్పుడు విద్యుత్‌ కనెక్షన్లను పరిశీలిస్తుండాలని అగ్నిమాపక అధికారులు సూచిస్తున్నారు.

ఇవీ చదవండి :

Kadapa Crime News: అర్థరాత్రి రెచ్చిపోయిన ఆగంతకులు.. హైకోర్టు న్యాయవాదికి చెందిన మూడు కార్లకు నిప్పు

5వ భార్య భర్తకు మొదట ఫోర్న్ వీడియోలు చూపించింది.. ఆ తర్వాత కాళ్లు, చేతులు కుర్చీకి కట్టింది.. చివరికి..