ఇదో విచిత్ర సంఘటన. మద్యం తాగేందుకు స్నేహితుని ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి అతని ఇంటికి పూర్తి గా దోచేశాడు. పూటుగా మద్యం తాగి, నిద్రపోతున్న సమయంలో పెట్టేబేడా సర్దుకుని ఉడాయించాడు. వేరే రూమ్ లో నిద్రపోతానని చెప్పి, అందరూ నిద్రపోతున్న సమయంలో రూ.75 లక్షలతో ఉడాయించాడు. విషయం తెలుసుకున్న బాధితుడు చూసేసరికి లబోదిబోముంటూ బావూరుమన్నాడు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మూసారాంబాగ్ సలీమ్‌నగర్ కాలనీకి చెందిన సాయిప్రకాశ్ స్థిరాస్తి వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. అతని మిత్రుడు ఫిరోజ్ గోవా నుంచి హైదరాబాద్ కు శుక్రవారం రాత్రి వచ్చాడు. పబ్‌కు వెళ్దామని కోరాడు. దీంతో సాయిప్రకాశ్ ఫిరోజ్ తో కలిసి కొత్తపేటలోని ఓ పబ్‌కు వెళ్లారు. అక్కడ వారికి పాత మిత్రుడు రాజేశ్ కలిశాడు. అక్కడే రాజేష్ మిత్రుడు కూడా ఉన్నాయి. అందరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత నలుగురూ కలిసి మద్యం తాగేందుకు సలీమ్‌నగర్‌లోని సాయిప్రకాష్ ఇంటికి వెళ్లారు.
విందు పూర్తి చేసుకున్నాక.. ఫిరోజ్ సాయి ప్రకాశ్ ఇంట్లోని ఓ గదిలో పడుకున్నాడు. మిగతా ముగ్గురూ హాలులో నిద్రపోయారు. సాయిప్రకాశ్ వాష్ రూమ్ కు వెళ్లేందుకు లేచాడు. అదే సమయంలో ఫిరోజ్ పడుకున్న రూమ్ లోని బెడ్ పై ఖాళీ బ్యాగు కనిపించింది. హాలులో ఫిరోజ్ కనిపించలేదు. భూమి అమ్మడంతో వచ్చిన రూ.75 లక్షల నగదు ఆ బ్యాగులో ఉంచానని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..