Hyderabad: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు (Azadika Amrit Mahotsavam) జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కేంద్రమంత్రి...
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు (Azadika Amrit Mahotsavam) జరుగుతున్నాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆగస్టు 15న ప్రతి ఇంటిపై మువ్వన్నెల జెండా రెపరెపలాడాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) పిలుపునిచ్చారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వజ్రోత్సవాలను జయప్రదం చేయాలని కోరారు. సిద్ధాంతాలు, రాజకీయాలకు అతీతంగా జెండా పండుగను జరుపుకుందామని కోరారు. మన దేశభక్తిని, జాతీయ భావాన్ని అందరం కలిసి చాటి చెప్పాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు జెండా పండుగను విజయవంతం చేసి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాలని చెప్పారు. కాగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా ఆగస్టు 2 నుంచి 15 వరకు వివిధ సోషల్ మీడియాల్లోని ప్రొఫైల్ పిక్చర్ లో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 75 ఏళ్ల స్వాతంత్ర్యానికి గుర్తుగా దేశంలోని 75 రైల్వే స్టేషన్లకు స్వాతంత్య్ర సమరయోదుల పేర్లు పెట్టామన్నారు. అలాంటి స్టేషన్లను సందర్శించాలని, పిల్లలకు, విద్యార్థులకు వారి గొప్పదనాన్ని తెలియజేయాలని సూచించారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం ఉద్యమంగా సాగుతుండటం ఆనందాన్ని కలిగిస్తోంది ప్రధాని చెప్పారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉంటుందని.. మీ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని దేశప్రజలను కోరారు. అంతే కాకుండా యూకేలోని బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్‌వెల్త్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు గొప్ప ప్రదర్శన కనబరచాలని ఆకాక్షించారు.