
పాతబస్తీ ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన సయ్యద్ ఫయ్యాజ్ రియల్ స్టేట్ వ్యాపారంతో పాటు ల్యాండ్ సెటిల్మెంట్స్ చేస్తుంటాడు. దుండిగల్ పోలీస్ స్టేషన్ రౌడిషీటర్ ముజాహీద్, ముజ్జూ అనే వ్యక్తుల మధ్య భూతగాదా, డబ్బు లావాదేవిల కారణంగా మనస్పర్ధలు కొనసాగుతున్నాయి.. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని ముజ్జూపై పగబట్టాడు ఫయ్యాజ్.. అప్పటికే ఇస్మాయిల్ అనే వ్యక్తి హత్య కేసులో జైలులో ఉన్నా ముజ్జు పెరోల్‌పై ఇటీవలే జైలు నుంచి బయటికి వచ్చాడు. దీంతో ఫయ్యాజ్.. మజ్జు హత్యకు ప్రణాళిక రూపొందించాడు.
ఫలక్‌నుమా ప్రాంతానికి చెందిన సయ్యద్ జాఫర్ ఉద్దీన్, లక్ నుమా సస్పెక్ట్ రౌడీషీటర్ మహమ్మద్ ఖలీలుద్దీన్, మైలార్ దేవ్ పల్లీ రౌడిషీటర్ మహమ్మద్ ఇబ్రాహీంతో పాటు, ఫలక్‌నుమాకు చెందిన సయ్యద్ యూనుస్, అజ్జూతో కలిసి 15 లక్షల రూపాయతో హత్యకు ఒప్పందం ఖర్చును కుదుర్చుకున్నాడు ఫయ్యాజ్ . అడ్వాన్స్‌గా 40 వేల రూపాయలు, హత్య అనంతరం మొత్తం డబ్బు ముట్టజెప్పే విధంగా ఒప్పందం చేసుకున్నారు.
ముజ్జూ హత్యకు కుట్ర జరుగుతుందన్న పక్కా సమాచారం సౌత్‌జోన్ టాస్క్ ఫోర్స్‌కు అందడంతో స్థానిక ఫలక్‌నుమా పోలీసులుతో కలిసి ఐదు మందిని ముందస్తుగానే అదుపులోకి తీసుకున్నారు. నలభై వేల రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ కొరకు ఫలక్ నుమా పోలిసులకు అప్పగించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..