
హైదరాబాద్, నవంబర్ 20: ప్రయాణీకులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించాలనే దార్శనికతతో, భారతీయ రైల్వేలు రైల్వే స్టేషన్లను భారీ స్థాయిలో పునరాభివృద్ధి చేయడం ద్వారా ఓ పెద్ద పరివర్తనను చేపడుతున్నాయి. ‘అమృత్ భారత్ స్టేషన్ పథకం’ (ఏబీఎస్ఎస్)కింద తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 40 రైల్వే స్టేషన్లను రూ. 2,750 కోట్ల అంచనా వ్యయంతో పునరాభివృద్ధి చేస్తున్నారు. ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను అందించడానికి, వాటిని ప్రాంతీయ జనాభాకు వృద్ధి కేంద్రాలుగా మార్చడానికి ఇవి ఉపయోగపడతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 2023 – ఫిబ్రవరి 2024లో తెలంగాణ రాష్ట్రంలో స్టేషన్ల పునరాభివృద్ధికి శంకుస్థాపన చేసినప్పుడు ఈ మిషన్‌కు గొప్ప విశిష్ఠత లభించింది. ఈ జాబితాలో ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా పెద్ద ఎత్తున చేపట్టిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పనుల ప్రధాన పునారభివృద్ధి కూడా ఉంది .
వీటిలో బేగంపేట, వరంగల్, కరీంనగర్.. ఈ 3 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి ప్రారంభించారు. మిగిలిన స్టేషన్లలో పనులు కొనసాగుతున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, దీర్ఘకాలిక దృక్పథంతో నిరంతర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ (ఏబీఎస్ఎస్) అనే విధానాన్ని రూపొందించింది. ఎప్పటికప్పుడు పెరుగుతున్న అవసరాలకు అనుగుణముగా వివిధ కీలక అంశాల అభివృద్ది చేయాలనే ఆలోచనతో మాస్టర్ ప్లాన్ ప్రకారం రూపొందించి అమలుపరచడం దీని ప్రధాన ఉద్దేశ్యం .
టెర్రస్ స్లాబ్ నిర్మాణం పూర్తయింది. గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మాణ పని, మొదటి అంతస్తులో ఆధునీకరించిన బుకింగ్ కార్యాలయం కోసం నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్లంబింగ్ పనులు మరియు, ప్లాస్టరింగ్ పనులు పురోగతిలో ఉన్నాయి.
ప్లాట్‌ఫామ్ సరిహద్దు గోడ పని, ప్లాట్‌ఫామ్ పై డక్ట్ పని పూర్తయింది. పార్కింగ్ షెడ్లు పునాది పనులు పూర్తయ్యాయి.
గిర్డర్ లాంచింగ్, గ్యాంగ్‌వే బాటమ్ షీటింగ్, కానోపీ పూర్తయ్యాయి. స్లాబ్ రీన్ఫోర్స్‌మెంట్ పనులు పురోగతిలో ఉన్నాయి.
తాపీ పని, ప్లాస్టరింగ్, ప్లంబింగ్ పూర్తయ్యాయి. చివరి దశ పనులు పురోగతిలో ఉన్నాయి. ప్లాట్‌ఫారమ్‌లపై పై కప్పు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్ల పనులను త్వరలో చేపడతారు. అన్ని పనులు ఏకకాలంలో పురోగతిలో ఉన్నాయి. జూన్ 2026 నాటికి మొత్తం నిర్మానం పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.