
హైదరాబాద్, మే 19: నగరంలోని కల్తీ రాయుళ్లపై ఫుడ్ సేఫ్టీ డిపార్ట్‌మెంట్ కొరడా విధిలించింది. పలు షాపులు, హోటళ్లు, సూపర్ మార్కెట్లపై ఆకస్మిక దాడులు జరుపుతుంది. ఈ క్రమంలో కూకట్‌పల్లిలోని ప్రముఖ లూలూ హైపర్‌మార్కెట్‌లో ఆహార భద్రతా శాఖ కమిషనర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించించింది. ఈ దాడిలో స్వీట్లు, నూనెలు, పిండి, మాంసం, పప్పుధాన్యాలతో సహా మొత్తం 150 కిలోగ్రాముల సురక్షితం కాని ఆహార పదార్థాలను ఆహార భద్రతా అధికారులు స్వాధీనం చేసుకుంది.
తీవ్రమైన ఆహార భద్రతా ఉల్లంఘనలు, అపరిశుభ్రత పరిస్థితులు, కుళ్ళిపోయిన కూరగాయలు, చిరిగిన- తప్పుదారి పట్టించే లేబుల్‌లతో ఉన్న గడువు ముగిసిన ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు గుర్తించారు. అంతేకాకుండా రిఫ్రిజిరేటర్లలో మిగిలిపోయిన ఆహారం నిల్వ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ లూలూ హైపర్‌మార్కెట్‌లో అనేక ఉత్పత్తులకు FSSAI లైసెన్స్ కూడా లేదు. పైగా షాప్ లోపల నేలంతా పురుగులతో అపరిశుభ్రంగా ఉంది. శనగపిండి, గోధుమ పిండి, పప్పుల ప్యాకెట్లలో సైతం పురుగులు కనిపించాయి.
#CFS_telangana – Based on the complaint received, Food Safety officials conducted an inspection at M/s Lulu Hypermarket, KPHB Colony and detected multiple serious violations across the premises.
🔴 In-House Kitchen Violations:
• Poor hygiene conditions observed
• Leftover food… pic.twitter.com/b4s1bw9inh— Commissioner of Food Safety, Telangana (@cfs_telangana) May 18, 2026
మాంసం విభాగంలో ఘాటైన కుళ్లు వాసన వెలువడటంతో పాటు, మురుగునీటి కాలువలు మూసుకుపోయి కనిపించాయి. అక్కడి పరిస్థితులు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కలిగించేవిగా దర్శనమిచ్చాయి. ఇక మాంసం కోసే ప్రాంతం, రిటైల్ విభాగం, ఇన్ హౌస్ కిచెన్‌తో సహా దాదాపు ప్రతి సెక్షన్‌లోనూ తీవ్రమైన ఉల్లంఘనలు కనించాయి. దీంతో మాల్‌లోని ఆహార పదార్ధాల నమూనాలను సేకరించి, వాటిని ల్యాబ్ పరీక్ష కోసం అధికారులు పంపించారు. నిత్యం రద్దీగా ఉండే కూకట్‌పల్లీ లూలూ హైపర్ మార్కెట్లో పెద్ద ఎత్తున ఆహార పదార్ధాలను సీజ్ చేశారు. అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్ధాలను విక్రయిస్తున్న లూలూ మార్కెట్ బండారం బయటపడటంతో జనాలు అప్రమత్తమయ్యారు. పైకి ఎంతో విలాసవంతంగా కనిపించే ఇలాంటి మార్కెట్లలో సరుకులు కొనుగోలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించే పరిస్థితి నెలకింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.