హైదరాబాద్‌లో లవ్‌జిహాద్ కలకలం

ఇందిర అలియాస్‌ జుబేరా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ హాస్టల్‌లో ఉంటోంది. రిజ్వాన్‌ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రిజ్వాన్‌ను పెళ్లి చేసుకున్నానంటూ కొద్ది రోజుల క్రితం ఇందిర తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. చూడాలని ఉదంటూ యువతి తల్లిదండ్రులకు మెస్సేజ్‌ పంపింది. కూతురు మెస్సేజ్‌తో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చారు. వారు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఇందిర, రిజ్వాన్ ల‌ వివాహ‌ విషయం తమకు తెలియదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో […]

హైదరాబాద్‌లో లవ్‌జిహాద్ కలకలం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 01, 2019 | 6:30 PM

ఇందిర అలియాస్‌ జుబేరా హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఓ హాస్టల్‌లో ఉంటోంది. రిజ్వాన్‌ గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. రిజ్వాన్‌ను పెళ్లి చేసుకున్నానంటూ కొద్ది రోజుల క్రితం ఇందిర తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. చూడాలని ఉదంటూ యువతి తల్లిదండ్రులకు మెస్సేజ్‌ పంపింది. కూతురు మెస్సేజ్‌తో తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వచ్చారు. వారు హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత అసలు విషయం తెలిసింది. ఇందిర, రిజ్వాన్ ల‌ వివాహ‌ విషయం తమకు తెలియదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్‌లో బీటెక్‌ చదువుతున్నప్పుడు ఇందిరకు రిజ్వాన్‌తో పరిచయం ఏర్పడింది. పెళ్లి పేరుతో మత మార్పిడి చేశాడని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. రిజ్వాన్ బారినుండి తమ కూతురిని అప్పగించాలంటూ వారు పంజాగుట్ట ఏసీపీకి ఫిర్యాదు చేశారు.