AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: లోకల్‌ – నాన్‌ లోకల్‌.. బీఆర్‌ఎస్‌లో తెరపైకి కొత్త పంచాయితీ.. చివరకు టికెట్ దక్కేదెవరికి..?

Malkajgiri BRS: హైదరాబాద్‌ బీఆర్ఎస్‌లో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడంతో టికెట్ ఆశిస్తున్న స్థానిక నేతలు అధిష్టానం ఎదుట సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. లోకల్ వారికే సీటు ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. వాస్తవానికి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరి అసెంబ్లీ సీటుతో పాటు..

BRS: లోకల్‌ - నాన్‌ లోకల్‌.. బీఆర్‌ఎస్‌లో తెరపైకి కొత్త పంచాయితీ.. చివరకు టికెట్ దక్కేదెవరికి..?
BRS MLA Seat
Shaik Madar Saheb
|

Updated on: Sep 24, 2023 | 9:44 AM

Share

Malkajgiri BRS: హైదరాబాద్‌ బీఆర్ఎస్‌లో కొత్త పంచాయితీ తెరపైకి వచ్చింది. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్‌కు రాజీనామా చేయడంతో టికెట్ ఆశిస్తున్న స్థానిక నేతలు అధిష్టానం ఎదుట సరికొత్త డిమాండ్‌ను ఉంచారు. లోకల్ వారికే సీటు ఇవ్వాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు. వాస్తవానికి, ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్‌గిరి అసెంబ్లీ సీటుతో పాటు.. ఆయన కొడుకు కోసం మెదక్ అసెంబ్లీ సీటును ఆశించారు. బీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు ఇవ్వకుండా, మల్కాజ్‌గిరి సీటును మాత్రమే కేటాయించడంతో మైనంపల్లి చివరకు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం మల్కాజ్‌గిరి అభ్యర్థి కోసం కసరత్తు చేస్తుంటే.. లోకల్‌-నాన్‌ లోకల్‌ ఫైట్‌ తెరపైకి వచ్చింది. మల్కాజ్‌గిరి స్థానం రేస్‌లో.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి పోటీలో పాటు.. మరో సీనియర్ నేత శంభీపూర్ రాజు సైతం.. మల్కాజ్ గిరి అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెచ్చారు. లోకల్‌ – నాన్‌లోకల్‌ డిమాండ్‌ను ఎత్తుకున్న ఆశావాహులు.. లోకల్ వారికే టికెట్ కేటాయించాలంటూ అధిష్టానాన్ని కోరుతున్నారు.

మైనంపల్లి రాజీనామా నేపథ్యంలో మల్కాజ్‌గిరి టికెట్ స్థానికులకే కేటాయించాలని స్థానిక నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. మాజీ కార్పోరేటర్ కరుణాకర్ అధ్వర్యంలో సమావేశమైన పార్టీ కార్యకర్తలు.. ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇచ్చే అభ్యర్థిని ఎంచుకోవాలని అధిష్టానాన్ని కోరారు. అభ్యర్థిని ఎంచుకునే సమయంలో స్థానిక నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని నేతలు కోరుతున్నారు.

బద్దం పరుశరామిరెడ్డి సమావేశం..

అలానే.. బీఆర్ఎస్‌ పార్టీ నేత, ఉద్యమకారుడు బద్దం పరుశరామిరెడ్డి ఆధ్వర్యంలో ఉద్యమకారులు, జేఏసీ నేతలు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గత రెండు ఎన్నికల్లో బీఆర్ఎస్‌ అధిష్టానం నిర్ణయించిన అభ్యర్థులను గెలిపించామని.. ఈ సారి ఖచ్చితంగా స్థానికులకే అవకాశం ఇవ్వాలని ఆ పార్టీ నేత, ఉద్యమకారుడు బద్దం పరుశరామిరెడ్డి అధిష్టానాన్ని కోరారు.

ఓవైపు.. అసంతృప్తులను బుజ్జగిస్తూ వస్తున్న బీఆర్‌ఎస్‌ అధిష్టానానికి లోకల్‌-నాన్‌ లోక్‌ ఇష్యూ తలనొప్పిగా మారింది. ఇదే సమయంలో.. ఇప్పటి వరకూ కుటుంబంలో ఒక్కరికే ఛాన్స్‌ ఇస్తూ వచ్చింది బీఆర్ఎస్ అధిష్టానం.. అయితే.. ఇప్పుడు.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డికి సీటు ఇస్తే.. మరికొన్ని సమస్యలు ముందుకు వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అందుకే.. టికెట్ ఆశించే వ్యక్తులు ఎవరైనా.. స్థానిక నేతల మద్దతు ఉంటేనే ఇస్తామనే హామీ వారికి ఇచ్చే అవకాశం ఉంది. ఇలా ఎక్కడైతే నేతలు పార్టీ వీడుతున్నారో.. అక్కడ డామేజ్ కంట్రోల్ ఆపరేషన్ మొదలుపెడుతోంది అధిష్టానం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
రవీంద్ర భారతిలో ఆటా సందడి.. తెలుగు మూలాలను మర్చిపోవద్దన్న గవర్నర్
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
ఫ్రీగా సినిమా టికెట్స్.. రెస్టారెంట్‌లో భోజనం.. మీకు కూడా..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
15 రోజుల ముందే చెప్పేసిన హిట్‌మ్యాన్..
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి
'నేనూ భారతీయుడినే..' డెహ్రాడూన్ జాత్యహంకార దాడిలో విద్యార్ధి మృతి