Hyderabad: మందుబాబుల మనసు చివుక్కుమంటుంది.. ఈ వార్త వింటే

మందుబాబులకు ఇది కొంచెం బ్యాడ్ న్యూసే.. ఏప్రిల్ 12న శనివారం నాడు హనుమాన్ జయంతి సందర్భంగా ఉదయం 6 గంటల నుంచి నెక్స్ట్ రోజు ఉదయం 6 గంటల వరకు మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. ఆ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందామా..

Hyderabad: మందుబాబుల మనసు చివుక్కుమంటుంది.. ఈ వార్త వింటే
Liquor

Edited By:

Updated on: Apr 11, 2025 | 12:32 PM

మందుబాబులకు ఓ బ్యాడ్ న్యూస్. హనుమాన్ జయంతి నేపథ్యంలో ఏప్రిల్ 12న ఉదయం 6 గంటల నుంచి 13వ తేదీ ఉదయం 6 గంటల వరకు అన్ని వైన్ షాపులు, బార్లు మూతపడనున్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని మద్యం దుకాణాలు మూసివేయాలని నగర కమిషనర్ సీవీ ఆనంద్ ఆదేశించారు. కల్లు దుకాణాలకు కూడా అనుమతి లేదని స్పష్టం చేశారు. జంటనగరాల్లో ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని ప్రజలు సహకరించాలని కోరారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రజలు ఆనందోత్సాహాలతో హనుమాన్ జయంతి జరుపుకోవాలని సూచించారు.

ఇక రాష్టానికి కొత్త లిక్కర్ బ్రాండ్లు రావాలని తెలంగాణ బెవరేజెస్​ కార్పొరేషన్​ లిమిటెడ్​ మద్యానికి ప్రకటన జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ ప్రకటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. 92 మద్యం సరఫరా కంపెనీలు.. 604 రకాల మద్యం బ్రాండ్లను సరఫరా చేస్తామంటూ అప్లికేషన్స్ అందజేశాయి. వీటిలో 331 ఇండియన్​ మేడ్​ ఫారిన్​ లిక్కర్​ కొత్త బ్రాండ్లు కాగా, 273 ఫారిన్​ బ్రాండ్లు ఉన్నట్లు తెలిసింది. మరోవైపు శనివారం నగరంలో జరగబోయే హనుమాన్ శోభాయాత్రకు కమిషనర్ సీవీ ఆనంద్.. పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ చూడండి