నగరంలోని కుత్బుల్లాపూర్ పరిధిలోని ప్రగతినగర్‌లో గత రెండు రోజులుగా చిరుతపులి కలకలం రేపుతోంది. ఇక బుధవారం అర్ధరాత్రి ప్రగతినగర్‌లోని గీతాంజలి పాఠశాలలోని మొదటి అంతస్తులోని ఓ గదిలో చిరుత చిక్కుకుంది. పాఠశాల నుంచి అరుపులో రావడంతో భయాందోళనకు గురైన స్థానికులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అటవీశాఖ, పోలీస్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అదే పాఠశాలలో రాత్రి విధులు నిర్వహిస్తున్న వాచ్‌మన్ చిరుతపులి అరుపులకు భయపడి పాఠశాలలోనే ఉండిపోయాడు. అతడి రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.