హైదరాబాద్‌లో అంతరిక్ష మ్యూజియం!
ఇస్రో సహకారంతో దేశంలోనే తొలి ప్రైవేట్ అంతరిక్ష మ్యూజియం హైదరాబాద్ ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ మ్యూజియాన్ని శుక్రవారం ప్రారంభించనుండగా.. 2డి, 3డి మోడళ్లకు చెందిన కొన్ని ఖగోళ వస్తువులను ఇందులో ప్రదర్శించనున్నారు. ఈ మ్యూజియం ద్వారా చిన్నారులకు అంతరిక్ష పరిజ్ఞానంపై అవగాహన పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు. కాగా ఈ మ్యూజియంలో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మోడల్ రాకెట్లను పూర్తి వివరాలతో అందుబాటులో ఉంచారు.