Leopard Roaming: హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత పులి సంచారం.. ఆవుపై దాడి.. హడిపోతున్న జనాలు..

Leopard Roaming: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి కదలికలు తీవ్ర కలకలం రేపాయి. రాజేంద్రనగర్‌లో జయశంకర్..

Leopard Roaming: హైదరాబాద్ శివారులో మరోసారి చిరుత పులి సంచారం.. ఆవుపై దాడి.. హడిపోతున్న జనాలు..

Updated on: Feb 15, 2021 | 11:20 AM

Leopard Roaming: హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో మరోసారి చిరుత పులి కదలికలు తీవ్ర కలకలం రేపాయి. రాజేంద్రనగర్‌లో జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వాలంతరి వద్ద ఆవుపై చిరుత పులి దాడి చేసింది. ఇది గమనించిన ఆవుల యజమాని పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు.. అటవీశాఖ అధికారులను అప్రమత్తం చేశారు. అటవీశాఖ అధికారులతో పాటు.. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన ఆవులను పరిశీలించారు. అక్కడ ఉన్న పాదముద్రల ఆధారంగా చిరుత సంచారాన్ని నిర్ధారించారు.

అయితే, హైదరాబాద్ శివారులోని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్, గొల్లపల్లి, మామిడిపల్లి, రాజేంద్రనగర్‌ పరిసర ప్రాంతాల్లో చిరుత సంచారం అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. చిరుతలు జనావాసాల్లోకి వస్తుండటంతో గజగజ వణికిపోతున్నారు. ఇదిలాఉంటే.. గతంలో రాజేంద్రనగర్ సర్కిల్ గగన్ పహాడ్‌లోని ఓల్డ్ కర్నూ రోడ్డులో చిరుత నడిరోడ్డుపై నిద్రిస్తూ కనిపించింది. కొన్ని నెలల పాటు అటవీశాఖ అధికారులకు చుక్కలు చూపించిన చిరుత.. ఎట్టకేలకు బోనులో చిక్కింది. దాంతో చుట్టు పక్కన ప్రాంతాల ప్రజలు హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు. ఇప్పుడు మరో చిరుత రావడంతో ప్రజలకు కంటిమీద కునుకులేకుండా అయ్యింది.

Also read:

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఎటువంటి పరీక్ష లేకుండానే 10వ తరగతి అర్హతతో పోస్టల్ లో ఉద్యోగాలు ఎలా అప్లై చేయాలంటే..

Kalyan Ram’s new film: దూసుకుపోతున్న ‘మైత్రీ మూవీ మేకర్స్’.. కల్యాణ్​రామ్​తో కొత్త సినిమా ప్రారంభం