AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అబ్బబ్బ.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..

అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

అబ్బబ్బ.. ఒక్కసారిగా మారిన వాతావరణం.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
Weather
Shaik Madar Saheb
|

Updated on: Jul 06, 2026 | 3:49 PM

Share

అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. వచ్చే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఉరుములు మెరుపులతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకారం.. నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి (Northern Limit of Monsoon) 22°N/60°E, 22°N/65°E, జామ్‌నగర్, ఉదయ్‌పూర్, అజ్మీర్, ఝున్‌ఝును, హిసార్, భటిండా – 32.5°N/70°E గుండా కొనసాగుతోంది. రాబోయే 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్‌లోని మరికొన్ని ప్రాంతాలు, హర్యానా, పంజాబ్‌లలో మిగిలిన ప్రాంతాలతో పాటు రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలకు మరింత ముందుకు విస్తరించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

దక్షిణ జార్ఖండ్ – దానిని ఆనుకుని ఉన్న ఉత్తర అంతర్గత ఒడిశాపై ఉన్న వాయుగుండం (Depression) గత 6 గంటల్లో గంటకు 15 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదిలింది. ఇది ఈ రోజు, జులై 6, 2026 ఉదయం 08:30 గంటల (IST) సమయానికి అదే ప్రాంతంలో 22.7°N అక్షాంశం, 85.1°E రేఖాంశం వద్ద కేంద్రీకృతమై ఉంది. అంటే, రూర్కెలా (ఒడిశా)కు ఉత్తర-ఈశాన్యంగా 60 కి.మీ, రాంచీ (జార్ఖండ్)కి దక్షిణ-నైరుతిగా 70 కి.మీ, జష్‌పూర్ నగర్ (ఛత్తీస్‌గఢ్)కు తూర్పు-ఆగ్నేయంగా 100 కి.మీ, డాల్టన్‌గంజ్ (జార్ఖండ్)కు ఆగ్నేయంగా 180 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది రాబోయే 24 గంటల్లో జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్, దానిని ఆనుకుని ఉన్న తూర్పు మధ్యప్రదేశ్ మీదుగా దాదాపు వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉంది.

తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:

సోమవారం, మంగళవారం, బుధవారం తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. క్రింది స్థాయి ఈదురుగాలులు ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణ ప్రాంతంలో 50 నుండి 60 కి మీ వేగంతోను మధ్య తెలంగాణ దక్షిణ తెలంగాణ ప్రాంతంలో 30 నుంచి 40 కి.మీ వేగంతోను రాగల మూడు రోజుల్లోనూ వీచే అవకాశం ఉంది.

ఏపీలో వర్షాలు..

ఇదిలాఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. దాదాపు అన్ని చోట్ల ఉరుములు మెరుపులతో ఈదురు గాలులతో వర్షాలు కురుస్తాయని.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us