Hyderabad: భాగ్యనగరంలో ఇళ్లకు యమ గిరాకీ.. రెట్టింపైన ధరలు.. ఊపందుకున్న గృహ మార్కెట్

|

Feb 27, 2021 | 1:24 PM

Land Rates in Hyderabad: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దేశంలోని టాప్ నగరాలల్లో భాగ్యనగరం ఒకటిగా ఉండటంతో ఇక్కడి భూములకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. అయితే నగరంలో ఇక బంగ్లాల ధరల..

Hyderabad: భాగ్యనగరంలో ఇళ్లకు యమ గిరాకీ.. రెట్టింపైన ధరలు.. ఊపందుకున్న గృహ మార్కెట్
Follow us on

Land Rates in Hyderabad: హైదరాబాద్ నగరం రోజురోజుకు విస్తరిస్తోంది. దేశంలోని టాప్ నగరాలల్లో భాగ్యనగరం ఒకటిగా ఉండటంతో ఇక్కడి భూములకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. అయితే నగరంలో ఇక బంగ్లాల ధరల గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే.. సిటీలోనే బంగ్లాలు కొనాలనుకునేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. అన్నింటికీ సౌలభ్యంగా ఉంటుందని.. ముఖ్యంగా ఐటీ హబ్‌కు దగ్గరగా ఉండాలనుకునేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నారు. దీంతో నార్మల్‌గా ఉన్న ధరలు ఒక్క సారిగా పెరిగిపోయయని ప్రాప్‌టైగర్‌ నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా దక్షిణ భారత దేశంలోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలల్లో ఇళ్ల ధరలు అధికంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్‌లో కొత్తగా 12,723 నివాస గృహాల నిర్మాణం ప్రారంభం కాగా.. 6,487 ఇళ్ల వరకు అమ్ముడైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. గతేడాది కరోనా వల్ల కొంత తగ్గుముఖం పట్టిన.. గృహ మార్కెట్ ప్రస్తుతం రెట్టింపైంది.

అయితే ఎక్కువగా.. హైదరాబాద్ నగరంలో జూబ్లీ హిల్స్ రియాల్టీ హబ్‌గా కొనసాగుతోంది. ఇక్కడ భూమి విలువ రోజురోజుకూ పెరుగుతోందని.. అది కూడా కోట్లల్లో పెరుగుతోందని పేర్కొంటున్నారు. గతేడాది నగరంలోని షాద్ నగర్, కోత్తూర్, మేడ్చల్ వంటి ప్రాంతాల్లో ఎకరం భూమి ధర 1నుంచి 2 కోట్లు పలికిందని.. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల ధర ఎకరం రూ.3.5 కోట్ల నుంచి రూ.4 కోట్లు పలుకుతుందని మార్కెట్ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాంతాలు హైదరాబాద్ ఐటీ కారిడార్ – గచిబౌలి- వాణిజ్య కేంద్రానికి కనీసం 30 నుండి 40 కి.మీ దూరంలో ఉంది. ఇదిలాఉంటే.. ఐటీ హబ్ 10 కిలోమీటర్ల వ్యాసార్థంలో భూమి రేట్లు 50 కోట్ల రూపాయిలు దాటాయి. కోకాపేటలో ఎకరం ధర రూ.60కోట్లకు చేరుకుంది. గతేడాది ఇక్కడ ఎకరం ధర 30 నుంచి 35 కోట్లు మాత్రమే ఉంది.

అయితే జూబ్లీ హిల్స్ పరిధిలో.. బాగా రేట్లు పెరుగుతున్నాయి. ఇక్కడ చదరపు గజం 1.2 లక్షల నుంచి 1.5 లక్షల వరకు పలుకుతోంది. అంటే ఇక్కడ ఎకర ధర సుమారు 65 కోట్ల నుంచి 70 కోట్లు ఉందన్నమాట. జూబ్లీహిల్స్‌లోని మరికొన్ని ప్రదేశాల్లో చదరపు గజం 2 లక్షలు కూడా పలుకుందని సమాచారం. అయితే అన్నింటికి జూబ్లీహిల్స్ సౌకర్యవంతంగా ఉండటమే దీనికి ప్రధాన కారణమని.. అంతేకాకుండా ఎన్నారైలు సైతం ఈ ప్రాంతంలోనే ఇళ్లు కొనుగోలు చేస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలో గృహమార్కెట్ అమాంతం పెరిగిందని రిజిస్ట్రేషన్ అధికారులు కూడా పేర్కొంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ఊపందుకోవడంతో.. బిల్డర్లందరూ ఆసక్తి కనబరుస్తున్నారు.

 

Also Read: