KTR: వెనక్కు తగ్గం.. కేటీఆర్ సంచలన ట్వీట్.. సీబీఐ విచారణకు హాజరు..
హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మరోసారి హీట్ పుట్టిస్తోంది.. మళ్లీ కేటీఆర్ ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఏసీబీ.. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ ముందు ఇవాళ హాజరయ్యారు. అయితే.. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు ముందు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు.

హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ కేసు మరోసారి హీట్ పుట్టిస్తోంది.. మళ్లీ కేటీఆర్ ప్రశ్నించేందుకు సిద్ధమైంది ఏసీబీ.. ఫార్ములా-ఈ రేస్ కేసులో కేటీఆర్ ఏసీబీ ముందు ఇవాళ హాజరయ్యారు. అయితే.. హైదరాబాద్ ఫార్ములా ఈ కార్ రేస్ విచారణకు ముందు కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదిలేదన్నారు. 6 గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేమీ ఆపలేవన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్‌ను ఎండగడుతూనే ఉంటామని కేటీఆర్ పేర్కొన్నారు. 420 హామీలు, డిక్లరేషన్ల పేరుతో కాంగ్రెస్ చేసిన దగాను ప్రజలకు వివరిస్తామని కేటీఆర్ తెలిపారు.
‘‘మీ దర్యాప్తులు, కమిషన్లు, మీ రాజకీయ ప్రతీకారం నన్ను ఆపలేవు.. 420 హామీలు, డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల డొల్లతనంపై.. బీఆర్‌ఎస్ పోరాడుతూనే ఉంటుంది’’ అంటూ కేటీఆర్ పేర్కొన్నారు.
లైవ్ వీడియో చూడండి..
మాజీమంత్రి కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరయ్యారు. తన వెంట లాయర్ కూడా ఉన్నారు. కేటీఆర్ విచారణ నేపథ్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫార్ములా ఈ కేసులో ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారిస్తున్నారు. కాగా.. విచారణకు ముందు నందినగర్ నివాసం నుంచి బీఆర్ఎస్ కార్యాలయానికి కేటీఆర్, హరీష్‌రావు వెళ్లారు. తెలంగాణ భవన్ నుంచి ఏసీబీ ఆఫీస్‌కు వెళ్లారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..