AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!

ఇటీవల హైదరాబాద్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు నగర ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు .ఇటీవలే ఉప్పుగూడ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన గొడవలో ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మరువక ముందే నగరంలో అలాంటి ఘటనే మరోకటి వెలుగు చూసింది. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడం కలకలం రేపింది.

హైదరాబాద్‌లో పట్టపగలే దారుణం.. అందరూ చూస్తుండగానే కత్తులతో దాడి.. వణికిపోయిన జనం!
Saidabad Crime News
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Aug 04, 2026 | 3:59 PM

Share

హైదరాబాద్: నగరంలో గంజాయి మత్తులో తిరిగే యువకుల ఆగడాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. సైదాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సింగరేణి కాలనీలో 35 ఏళ్ల హమేర్ అనే వ్యక్తిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన హమేర్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించగా, అతని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం అతను హాస్పిటల్‌లో చికిత్స పోందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబాబాద్ పీఎస్‌ పరిధిలోని సింగరేణి కాలనీకి చెందిన హమేర్‌పై అనే వ్యక్తి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారనే సమాచారంతో అక్కడికి వెళ్లామని అప్పటికే తీవ్రంగా గాయపడిన ఉన్న హమేర్ హాస్పిటల్‌కు తరలించి కుటుంబ సభ్యులు చికిత్స అందించారని పోలీసలు తెలిపారు. అయితే హమేర్‌పై గతంలో పలు చోరీ కేసులు ఉన్నాయని.. పాత కక్షలు, ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగానే ఈ దాడి జరిగినట్లు పోలీసులు ప్రధామికంగా అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు

ఇలా నగరంలో వరుస ఘటనల నేపథ్యంలో హైదరాబాద్ ప్రాంత వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒంటరికిగా బయటకు వెళ్లాలన్నా భయపడిపోతున్నారు. గంజాయి ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని, నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దాడిలో పాల్గొన్న నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us