China Manja: ప్రాణాలు తీస్తున్న డేంజర్‌ మాంజా.. సంక్రాంతి వేళ బండితో రోడ్డెక్కాలంటే భయం భయం..

పీక తెగితే చాలు.. చైనా మాంజా అనేస్తున్నారు. చైనా నుంచి మాంజా దిగుమతులు ఆపలేరా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, అలాంటి దారానికి 'చైనా మాంజా' అనే పేరు పడిపోయింది గానీ, వాటిని తయారుచేస్తున్నది లోకల్ మానుఫ్యాక్చరర్సే. మనదేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఈ చైనా మాంజా భారత్‌లోకి వచ్చిందన్నది నిజం.

China Manja: ప్రాణాలు తీస్తున్న డేంజర్‌ మాంజా.. సంక్రాంతి వేళ బండితో రోడ్డెక్కాలంటే భయం భయం..
Fatal Kite String Accidents

Updated on: Jan 13, 2026 | 9:40 PM

పీక తెగితే చాలు.. చైనా మాంజా అనేస్తున్నారు. చైనా నుంచి మాంజా దిగుమతులు ఆపలేరా అని ప్రశ్నిస్తున్నారు. నిజానికి, అలాంటి దారానికి ‘చైనా మాంజా’ అనే పేరు పడిపోయింది గానీ, వాటిని తయారుచేస్తున్నది లోకల్ మానుఫ్యాక్చరర్సే. మనదేశంలో కైట్ ఫెస్టివల్స్ జరిగినప్పుడు ఈ చైనా మాంజా భారత్‌లోకి వచ్చిందన్నది నిజం. పెద్దపెద్ద పతంగులు ఎగరవేయడానికి బాగా పనికొచ్చాయ్ అవి. వాటిని చూసి.. స్థానికులు కూడా తయారుచేయడం మొదలుపెట్టారు. సో, చైనాలో తయారుచేసినట్టే ఇక్కడా తయారు చేస్తున్నారు. అలాగని స్మగ్లింగ్ జరగడం లేదని కాదు. ఆ ఆరోపణలు కూడా ఉన్నాయ్. సంక్రాంతికి ముందే కోట్ల రూపాయల స్టాక్ దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు చేరుతోందన్న వాదనలున్నాయ్. వాటి నియంత్రణకు ఓవైపు చర్యలు తీసుకుంటున్నా.. ప్రజల్లోనూ అవగాహన వస్తే తప్ప పూర్తిగా కంట్రోల్ చేయడం కుదరదు. అది జరిగితే తప్ప ప్రాణాలు పోవడం ఆగదు. మాంజా ఎంత ప్రమాదకరమో.. ఓవైపు పోలీసులు చెబుతూనే ఉన్నారు. అదే సమయంలో.. ఆ పోలీసులే మాంజా బారినపడి చావు అంచుల దాకా వెళ్తున్నారు. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో చేస్తున్న ఏఎస్ఐ నాగరాజు.. నుమాయిష్ దగ్గర డ్యూటీ చేయడానికని ఉప్పల్ నుంచి బయలుదేరారు. సాయంత్రం నాలుగున్నర సమయంలో ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ దగ్గర.. నాగరాజు గొంతు కోసేసింది మాంజా. అదృష్టం బాగుండి తీవ్రగాయంతోనే బయటపడ్డారు. లేదంటే.. ఏమయ్యేది. రెండేళ్ల క్రితం హైదరాబాద్ లంగర్ హౌస్ దగ్గర అత్యంత విషాద ఘటన జరిగింది...

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి