తెలంగాణలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి తొలిదశ పల్లె కార్యాచరణ!

తెలంగాణలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి తొలిదశ పల్లె కార్యాచరణ!

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Aug 31, 2019 | 7:28 AM

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జత చేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండల స్థాయి అధికారులను ఇంచార్జులుగా నియమించాలని కలెక్టర్లను సిఎం ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడి అవడడానికి 30 రోజుల కార్యాచరణ నాంది పలకాలని సిఎం ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటినీ, అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30 రోజుల పాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు కూడా సిఎం వెల్లడించారు. గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతి భవన్ లో 7 గంటల పాటు సమీక్ష జరిగింది. పలువురు మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu