Vande Bharat Express: ఇకపై కేవలం 8 గంటల్లోనే! సికింద్రాబాద్ టూ విశాఖపట్నంకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్..

|

Jan 10, 2023 | 8:24 AM

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'వందేభారత్ ఎక్స్‌ప్రెస్' పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతోంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది.

Vande Bharat Express: ఇకపై కేవలం 8 గంటల్లోనే! సికింద్రాబాద్ టూ విశాఖపట్నంకి వందేభారత్ ఎక్స్‌ప్రెస్..
Vande Bharat Express
Follow us on

తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘వందేభారత్ ఎక్స్‌ప్రెస్’ పట్టాలెక్కేందుకు సర్వం సిద్దమవుతోంది. సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్ మధ్య ఈ ట్రైన్ పరుగులు పెట్టనుంది. ఈ రైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీ జనవరి 19న ప్రారంభించనున్నారు. వాస్తవానికి ఈ ట్రైన్‌ను మొదటగా సికింద్రాబాద్ నుంచి విజయవాడ వరకే అనుకున్నారు. అయితే.. ట్రాక్ అప్‌గ్రేడేషన్ పనులు విజయవాడ-విశాఖపట్నం మధ్య పూర్తి కావడమే కాదు.. పలువురు నేతలు విశాఖపట్నం వరకు వందేభారత్ ట్రైన్‌ను పొడిగించాలని విజ్ఞప్తులు చేయగా.. కేంద్ర ప్రభుత్వం తాజాగా విశాఖ వరకు పొడిగించింది.

ఇదిలా ఉంటే ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమండ్రి మీదుగా విశాఖపట్నం చేరుకుంటుంది. ఆయా స్టేషన్లలో మాత్రమే ఈ ట్రైన్ అగనుంది. ఈ వందే‌భారత్ రైలు గరిష్టంగా 180 కిమీ వేగంతో ప్రయాణించే సామర్ధ్యం కలిగి ఉంది. అంతేకాకుండా ఈ వందేభారత్ ట్రైన్.. ప్రస్తుతం నడుస్తోన్న జన్మభూమి ఎక్స్‌ప్రెస్ తరహాలో నడవనున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ నుంచి ప్రయాణికులు గతంలో పన్నెండు నుండి పద్నాలుగు గంటలతో పోలిస్తే ఇప్పుడు ఎనిమిది గంటల్లోనే విశాఖపట్నం చేరుకోవచ్చు. ఈ రైలులో 16 కోచ్‌లు ఉండగా, మొత్తం 1128 సీట్లు ఉంటాయి.

ఇవి కూడా చదవండి

మరోవైపు ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను తెలుగు రాష్ట్రాల మధ్య ప్రారంభిస్తున్న నేపధ్యంలో బీజేపీ నేత జీవీఎల్ ట్విట్టర్ ద్వారా ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ‘విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలును ప్రారంభించాలనే నా అభ్యర్ధన మేరకు ఈస్ట్ రైల్వే వాల్తేరు డివిజన్‌కు వందేభారత్ రెక్‌ను కేటాయించినందుకు, ట్రైన్‌ను విశాఖ వరకు కొనసాగించినందుకు ప్రధాని మోదీ, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు’ అని జీవీఎల్ ట్వీట్‌లో పేర్కొన్నారు.