Jubilee Hills By-Election: అన్ని పార్టీల అస్త్రం ఇదే.. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో మార్క్‌ మేటర్స్‌..

హైదరాబాద్‌ అభివృద్ధిపై.. జూబ్లీహిల్స్‌ మే సవాల్‌ అంటున్నాయి కాంగ్రెస్‌, BRS, BJP. జూబ్లీహిల్స్‌ బైపోల్స్‌లో, డెవలప్‌మెంట్‌ మార్క్‌ మేటర్స్‌ అంటున్నాయి. మార్పు మార్కు చూసి ఓటెయ్యండి అని అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అభివృద్ధి చుట్టూనే జూబ్లీ హిల్స్ ఎలక్షన్‌ రాజకీయం నడుస్తోంది.

Jubilee Hills By-Election: అన్ని పార్టీల అస్త్రం ఇదే.. జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో మార్క్‌ మేటర్స్‌..
Jubilee Hills By Elcetion

Updated on: Nov 09, 2025 | 8:11 AM

హైదరాబాద్‌ అభివృద్ధిపై.. జూబ్లీహిల్స్‌ మే సవాల్‌ అంటున్నాయి కాంగ్రెస్‌, BRS, BJP. జూబ్లీహిల్స్‌ బైపోల్స్‌లో, డెవలప్‌మెంట్‌ మార్క్‌ మేటర్స్‌ అంటున్నాయి. మార్పు మార్కు చూసి ఓటెయ్యండి అని అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. అభివృద్ధి చుట్టూనే ఎలక్షన్‌ రాజకీయం నడుస్తోంది. పదేళ్ల పాలనలో BRS చేసింది శూన్యం అని సీఎం రేవంత్‌ విమర్శిస్తే.. ఏం చేసినా కేసీఆర్‌ మార్క్‌ చెరపలేరని హరీష్‌ రావు కౌంటర్‌ ఇచ్చారు.

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక యుద్ధంలో అధికార కాంగ్రెస్‌, విపక్ష BRS, BJPలు తమ దగ్గర ఉన్న అస్త్రాలన్నింటినీ, రాజకీయ ప్రత్యర్థులపై ప్రయోగిస్తున్నాయి. లేటెస్టుగా అభివృద్ధి అనే అస్త్రాన్ని అమ్ములపొదిలో నుంచి తీశాయి అన్ని పార్టీలు. అభివృద్ధి పేరుతో నేతలు.. ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శల బాణాలు సంధించుకుంటున్నారు. హైదరాబాద్‌, తెలంగాణ అభివృద్ధి చుట్టూ చర్చ, రచ్చ సాగుతున్నాయి. దీంతో జూబ్లీహిల్స్‌లో హీట్ పెరిగింది.

అభివృద్ధి అంటే బీఆర్ఎస్‌.. బీఆర్ఎస్ అంటే అభివృద్ధి అన్నారు BRS సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీష్‌ రావు. వైఎస్సార్, చంద్రబాబు పేరు చెప్పి రేవంత్ ఓట్లు అడుక్కుంటున్నారని హరీష్‌ ఎద్దేవా చేశారు. ఏం చేసినా కేసీఆర్ మార్క్‌ చెరపలేరన్నారు హరీష్‌.

హరీష్‌ మాటలకు కౌంటర్‌ ఇచ్చారు సీఎం రేవంత్‌. పదేళ్ల పాలనలో BRS చేసింది ఏం లేదంటూ సీఎం రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారు.

ఇక కాంగ్రెస్, BRS దొందూ దొందే అన్నారు కేంద్రమంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌. ఆ రెండు పార్టీలు…హైదరాబాద్‌ అభివృద్ధికి చేసిందేమీ లేదని కమలం నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేకి, MIM మద్దతు ఇస్తున్న కాంగ్రెస్‌కి మధ్యే పోరు అంటున్నారు కాషాయ పార్టీ నేతలు.

మరోవైపు BRSతోనే తమకు పోరు నడుస్తోందని కాంగ్రెస్‌ చెబుతోంది. అన్ని పార్టీలు అభివృద్ధి అస్త్రాన్నే, ప్రత్యర్థి పార్టీలపై ప్రయోగిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..