AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. 11 మందికి పాజిటివ్.. మొదటిసారి ఆరుగురు విద్యార్థులపై కేసు..

హైదరాబాద్‌ను డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న ఈగల్ టీమ్... గ్రాము గంజాయి దొరికినా గుండు పగలగొడుతోంది. వరుస తనిఖీల్లో విస్తుపోయే వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది. ఈ క్రమంలో 11 మంది విద్యార్థులకు గంజాయి, డ్రగ్స్ పాజిటివ్ గా తేలడం కలకలం రేపింది. బర్త్‌డే పార్టీలో వారంతా డ్రగ్స్ తాగినట్లు పోలీసులు గుర్తించారు.

Hyderabad: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్.. 11 మందికి పాజిటివ్.. మొదటిసారి ఆరుగురు విద్యార్థులపై కేసు..
Hyderabad Drugs Party
Shaik Madar Saheb
|

Updated on: Nov 09, 2025 | 7:25 AM

Share

గ్రేటర్​హైదరాబాద్‌లో డ్రగ్స్ కల్చర్​కోరలు చాస్తోంది. ఎక్కడ చూసినా గంజాయి, మత్తు పదార్థాల కేసులే వెలుగుచూస్తున్నాయి. మహానగరంలోని యువత మత్తు పదార్థాలకు బానిసగా మారుతోంది. ముఖ్యంగా టీనేజర్స్‌ డ్రగ్స్‌ మత్తులో జోగుతున్నారు. గత ఆగస్టులో హైదరాబాద్‌లోని మహీంద్రా యూనివర్సిటీలో డ్రగ్స్‌ వినియోగం కలకలం రేపింది. ఏకంగా 50 మంది విద్యార్థులకు డ్రగ్స్ టెస్టులో పాజిటివ్​ రావడం సంచలనంగా మారింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది. రెండు నెలల క్రితం గచ్చిబౌలిలోనూ ఇలాంటి ఘటనే వెలుగు చూసింది.

ఇప్పుడు బేగంపేటలోని ఓ హోటల్‌ మేనేజ్‌మెంట్ ఇనిస్టిట్యూట్‌పై దాడులు చేసిన ఈగల్‌ టీమ్‌ విస్తుపోయే వాస్తవాలు వెల్లడించింది. ఇనిస్టిట్యూట్‌లో స్టూడెంట్స్‌ విచ్చలవిడిగా డ్రగ్స్‌ తీసుకోవడం చూసి పోలీసులకే షాక్‌ అయ్యారు. విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. 11 మందికి గంజాయి, డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. బర్త్‌డే పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారికి ఎస్ఆర్ నగర్ కు సంబంధించిన వ్యక్తి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు తెలిపారు.

ఈ మేరకు మొదటిసారి ఆరుగురు విద్యార్థులపై కేసు నమోదు చేశారు. కాగా, గతంలోనూ ఇదే ఇనిస్టిట్యూట్‌లో డ్రగ్స్ కేసులు వెలుగుచూసినట్లు ఈగల్‌ టీమ్‌ వెల్లడిచింది. ఎన్నిసార్లు తనికీలు చేసినా యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..