AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jubilee Hills ByPoll 2025 Voting Live: జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌.. క్యూ లైనులో వున్న వారికి అవకాశం!

Jubilee Hills By-Election 2025 Voting Live Updates: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ జరుగుతోంది. మొత్తం 4,01,365 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 58 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉంది.

Jubilee Hills ByPoll 2025 Voting Live:  జూబ్లీహిల్స్‌లో ముగిసిన పోలింగ్‌.. క్యూ లైనులో వున్న వారికి అవకాశం!
Jubilee Hills By Election 2025 Voting Live Updates
Ravi Kiran
| Edited By: Balaraju Goud|

Updated on: Nov 11, 2025 | 8:06 PM

Share

పోలింగ్‌కు వేళాయె. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు పోలింగ్ స్టేషన్లు రెడీ అయ్యాయి. పోలింగ్ సిబ్బంది EVM మిషన్లతో పోలింగ్‌ బూత్‌లకు తరలివెళ్లారు. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. 407 పోలింగ్‌ కేంద్రాల్లో ఈరోజు పోలింగ్ జరగనుంది. యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం నుంచి అన్ని డివిజన్లకు పోలింగ్‌ మెటీరియల్ చేరుకుంది. 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు.

ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. గొడవలకు, దొంగ ఓట్లకు తావులేకుండా నిఘా పెట్టారు అధికారులు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటిరింగ్‌ చేస్తున్నారు. EVMలు మొరాయిస్తే బ్యాకప్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో భారీ బందోబస్త్ ఏర్పాటు చేశామన్నారు పోలీసులు. శాంతిభద్రతల పరంగా 65 సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లను గుర్తించారమన్నారు పోఈలసులు. ఆయా ఏరియాల్లో రౌడీషీటర్లను బైండోవర్‌ చేశారు. ఎవరైనా దొంగ ఓట్లు వేస్తే కఠినచర్యలు తప్పవంటున్నారు పోలీసులు.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 11 Nov 2025 07:16 PM (IST)

    జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్‌దే గెలుపుః మహేష్ గౌడ్

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవబోతోంది -మహేష్ గౌడ్

    కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ వైపు ప్రజలు నిలిచారు

    సీఎం రేవంత్ ఎప్పటికప్పుడు మమ్మల్ని ముందుకు నడిపించారు

    కాంగ్రెస్ గెలుపు కోసం పని చేసిన వాళ్లందరికీ ధన్యవాదాలు

    అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించడంలో సఫలమయ్యాం -మహేష్‌గౌడ్

  • 11 Nov 2025 06:44 PM (IST)

    యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర టెన్షన్

    యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ దగ్గర టెన్షన్

    BRS, కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం

    BRS నేతలు మాగంటి సునీత, కౌశిక్ రెడ్డి తరలింపు

    దొంగ ఓట్లు వేయిస్తున్నారని BRS ఆందోళన

    అధికారులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ నేతల నినాదాలు

    BRS నిరసనపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం

    అనుచరులతో కలిసి రోడ్డుపైకి వచ్చిన చిన్న శ్రీశైలం యాదవ్

    రెండు వర్గాల ఆందోళనతో భారీగా పోలీసుల మోహరింపు

    BRS, కాంగ్రెస్ నేతలను చెదరగొట్టిన పోలీసులు

  • 11 Nov 2025 05:20 PM (IST)

    మార్పు రాని జూబ్లీహిల్స్ పోలింగ్

    ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు చాలెంజ్‌గా తీసుకున్నప్పటికీ.. పోలింగ్‌ శాతంలో ఏమాత్రం మార్పు కనిపించడంలేదు. ఉదయం నుంచి మందకొడిగానే కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ ఓటర్లు ఓటేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఎన్నికల సంఘం అవగాహన కల్పించినా ఓటర్లు ఇళ్ల నుంచి కదలడం లేదు. బస్తీల్లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఓటింగ్ స్లోగానే నడుస్తోంది.

  • 11 Nov 2025 05:19 PM (IST)

    జూబ్లీహిల్స్ బరిలో ఆఖరిగంట

    జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ చివరి దశకు చేరుకుంటోంది. పోలింగ్‌కు మరో గంట మాత్రమే సమయం మిగిలి ఉంది. ఆరు గంటల్లోపు క్యూలైన్‌లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు అధికారులు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటల వరకు 40.20 శాతం పోలింగ్ నమోదు అయింది.

  • 11 Nov 2025 04:14 PM (IST)

    ఓటు వేసిన గోపిచంద్

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో శ్రీనగర్ కాలనీలోని మహిళ సమాజం పోలింగ్ కేంద్రంలో తన ఓటు హక్కు వినియోగించుకున్న సినీ నటుడు గోపీచంద్

  • 11 Nov 2025 04:02 PM (IST)

    కార్వాన్‌ MLA కౌసర్‌ మొహినుద్దీన్‌పై BRS విమర్శలు

    MIM MLA కౌసర్‌ మొహినుద్దీన్‌ దగ్గరుండి కాంగ్రెస్‌కి అనుకూలంగా రిగ్గింగ్‌కి ప్లాన్‌ చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ

    బూత్‌ నెంబర్స్ 66,67లో ప్రిసైడింగ్ అధికారులను బెదిరించి, BRS ఏజెంట్‌ని మొహినుద్దీన్‌ బలవంతంగా బయటకుపంపారన్న బీఆర్ఎస్

    ఐడీ కార్డులు లేకుండానే ఓట్లు వేయిస్తున్నారన్న BRS

    సాయంత్రం 4తర్వాత పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కి ప్లాన్ చేశారని చెబుతున్న బీఆర్ఎస్

    వీడియోలు తీస్తున్నవాళ్ల ఫోన్లు కూడా లాక్కున్న MIM స్థానిక నేతలు

    పారామౌంట్ కాలనీ, అజీజ్‌బాగ్‌, సమతాకాలనీల్లో సేమ్ సీన్ అంటున్న BRS

  • 11 Nov 2025 02:57 PM (IST)

    రాజకీయ ప్రెస్‌మీట్‌లపై నిషేధంః ఈసీ

    జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ పూర్తయ్యే వరకు అన్ని రాజకీయ పత్రికా సమావేశాలపై నిషేధం ఉంటుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. భారత ఎన్నికల సంఘం (ECI) మార్గదర్శకాల ప్రకారం అందరు నడుచుకోవాలని ఈసీ సూచించింది.

  • 11 Nov 2025 02:55 PM (IST)

    ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలిః మంత్రి పొన్నం

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రజాస్వామ్యంగా జరగాలని ఆకాంక్షించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రజాస్వామ్యం పట్ల గౌరవాన్ని ఎప్పుడూ ఆచరించేది కాంగ్రెస్ పార్టీనేనని గుర్తు చేశారు. ఎవరైనా సరే ఏ పార్టీ నాయకులు అయిన నియోజకవర్గం కానీ నాయకులు నియోజకవర్గంలో ఎన్నికలు జరిగే సమయంలో తిరిగితే వారిపైన కేసులు పెట్టుకోవచ్చన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతున్నామని అసహనంతో మూడు రోజులుగా ఏది పడితే అది మాట్లాడుతున్నారని విమర్శించారు.

  • 11 Nov 2025 02:48 PM (IST)

    దొంగ ఓటు కలకలం

    పోలింగ్ బూత్ నెంబర్ 67 లో మరో ఫేక్ ఓటర్

    మహిళా ఓటర్ తన ఓటు వేసేందుకు రాగా.. అప్పటికే తన ఓటు వేరే వాళ్ళు వేశారని ఆవేదన

    పోలింగ్ అధికారులు సమాధానం చెప్పడం లేదని వాపోయినా మహిళా ఓటర్ భర్త

  • 11 Nov 2025 02:47 PM (IST)

    ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటింగ్ మందకొడిగా సాగుతోంది. అయితే ఓ వృద్ధురాలు వీల్ ఛైర్‌లో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె, అందరూ ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటు వేయకుంటే చచ్చిపోయినట్టే లెక్క అన్నారు. కష్టమయిన సరే వచ్చి ఓటు వేయాలని కోరారు. నడవలేకున్నా అయినా సరే వచ్చి ఓటు వేస్తున్నానని, యువకులు ఇళ్ల నుండి వచ్చి ఓటు వేయాలని సూచించారు.

  • 11 Nov 2025 02:03 PM (IST)

    ఈసీకి పరస్పరం ఫిర్యాదు

    • ఈసీకి కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం ఫిర్యాదు
    •  ఓటర్లను ప్రలోభపెడుతున్నారని ప్రత్యర్థులపై ఫిర్యాదుచేసిన ఇరు పార్టీలు
    • సాయంత్రం 6 గంటలకు ముగియనున్న పోలింగ్
    •  వెంగళరావు నగర్‌, బోరబండలో స్వల్ప గొడవలు
    • బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్య వివాదం
    • వెంగళరావునగర్‌, రహమత్‌నగర్‌లో.. ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్‌
  • 11 Nov 2025 01:51 PM (IST)

    ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్

    • మందకొండిగా జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు పోలింగ్
    • మ. ఒంటి గంట వరకు 31.94 శాతం పోలింగ్ నమోదు
  • 11 Nov 2025 01:29 PM (IST)

    ఓటు గల్లంతైందని నిరసన

    • కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక
    • బోరబండలో ఒక ఓటర్ నిరసన
    • తన ఓటు గల్లంతైందని ఓటర్‌ ఆందోళన
    • దుబాయ్‌ నుంచి వస్తే ఓటు వేయకుండా చేశారని ఆగ్రహం
    • అధికారులు పట్టించుకోలేదని ఓటర్‌ అసహనం
  • 11 Nov 2025 01:11 PM (IST)

    నైతికంగా కాంగ్రెస్ ఓడింది – బీఆర్ఎస్

    • మరోవైపు బీఆర్ఎస్ నేతలు సైతం ఈసీకి ఫిర్యాదు చేశారు
    • జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం తెలంగాణ ఎమ్మెల్యేలు వీధి రౌడీల అవతారం ఎత్తారని ఆగ్రహం
    • కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు
    • దిగజారిన ప్రవర్తనతో కాంగ్రెస్ తన ఓటమిని ఒప్పుకుంది, నైతికంగా ఆ పార్టీ ఓడిపోయిందని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు
  • 11 Nov 2025 12:55 PM (IST)

    బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ఫిర్యాదు

    • బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు
    • జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గొడవలకు పాల్పడుతున్నారని ఆరోపణ
    • స్థానికేతరులను ప్రచారం కోసం తిప్పుతున్నారని ఆగ్రహం
    • బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన అధికార పార్టీ
    • బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, ఆ పార్టీ కార్పొరేటర్లపై ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ నేతల ఫిర్యాదు
  • 11 Nov 2025 12:33 PM (IST)

    కొత్త ఓటర్ల జోష్..

    జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఫస్ట్ టైమ్ ఓటర్స్ తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నారు.

  • 11 Nov 2025 12:12 PM (IST)

    ఓటు హక్కు వినియోగించుకోండి – కర్ణన్

    జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్‌లను ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ ఆర్.వి కర్ణన్ పరిశీలించారు. పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని తెలిపారు. ప్రతీ ఓటర్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కర్ణన్ సూచించారు.

  • 11 Nov 2025 11:43 AM (IST)

    11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్

    • పోలింగ్‌పై జూబ్లీహిల్స్ ఓటర్ల నిరాసక్తత
    • జనం లేక వెలవెలబోతున్న పోలింగ్ కేంద్రాలు
    • ఓటేసేందుకు ఆసక్తి చూపని జూబ్లీహిల్స్ ఓటరు
    • ఎన్నికల సంఘం ఎంతగా అవగాహన పెంచినా కదలని ఓటరు
    • ఉదయం 11 గంటల వరకు 20.76 శాతం పోలింగ్ మాత్రమే నమోదు
    • బస్తీల్లో తప్ప మిగతా ప్రాంతాల్లో కదలని ఓటర్లు
  • 11 Nov 2025 11:29 AM (IST)

    విచ్చలవిడిగా డబ్బు పంచుతున్నారు – బొల్లం

    • కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది -బొల్లం మల్లయ్య
    • విచ్చలవిడిగా డబ్బుల పంపిణీ జరుగుతుంది -బొల్లం మల్లయ్య
    • బీఆర్ఎస్‌కు ఓటెయ్యకుండా నోట్ల కట్టలతో కొంటున్నారు
    • డబ్బు పంపిణీ జరుగుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారు
    • పోలీసులు కాంగ్రెస్‌కు ఒత్తాసు పలుకుతున్నారు -బొల్లం మల్లయ్య
    • ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలి -బొల్లం మల్లయ్య
  • 11 Nov 2025 11:15 AM (IST)

    జూబ్లీహిల్స్‌‌లో ప్రలోభాలపర్వం..!

    • జూబ్లీహిల్స్‌ బైపోల్‌లో ప్రలోభాలపర్వం..!
    • వెంగళరావునగర్‌, రెహమత్‌నగర్‌లో..
    • ఓటర్లకు డబ్బులు పంచుతున్నారంటూ వీడియోలు వైరల్‌
    • డబ్బులు పంచుతోంది మీరంటే మీరంటూ ఆరోపణలు
    • రెహమత్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేతల్ని..
    • రెడ్‌హ్యాడెడ్‌గా పట్టుకున్నామంటున్న బీఆర్‌ఎస్‌ నేతలు
    • ఓటర్లకు బీఆర్ఎస్ నేతలు డబ్బులు ఇస్తున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్
  • 11 Nov 2025 11:05 AM (IST)

    ఈసీ సీరియస్

    • నాన్‌ లోకల్‌ నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌
    • ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పోలింగ్‌బూత్‌కు రావడంపై ఆగ్రహం
    • ఓటర్లను ప్రభావితం చేసేవిధంగా తిరుగుతున్నారన్న ఈసీ
    • ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్‌..
    • MLC శంకర్‌నాయక్‌పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
  • 11 Nov 2025 10:54 AM (IST)

    ఓటేసిన నవీన్ యాదవ్..

    • ఓటు హక్కు వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్
    • యూసుఫ్‌గూడలో ఓటు వేసిన నవీన్‌యాదవ్, కుటుంబసభ్యులు
    • తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్‌తో వచ్చి ఓటేసిన నవీన్ యాదవ్
  • 11 Nov 2025 10:45 AM (IST)

    కార్పొరేటర్ ఫసియుద్దీన్ దాడి చేశారు – బీఆర్ఎస్

    • జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కొన్ని చోట్ల వివాదాలు
    • బోరబండ స్వరాజ్‌ నగర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య వివాదం
    • కార్పొరేటర్ ఫసియుద్దీన్ తమపై దాడి చేశారంటున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
    • అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి సునీతను అడ్డుకున్న పోలీసులు
    • పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం
    • పోలీసులు అధికార పక్షం వైపు నిలవడం సరికాదన్న సునీత
  • 11 Nov 2025 10:31 AM (IST)

    7 డివిజన్లలో మందకొడిగా పోలింగ్‌..

    • జూబ్లీహిల్స్‌లోని  7 డివిజన్లలోనూ మందకొడిగా పోలింగ్‌
    • ఓటర్లను బూత్‌లకు రప్పించేందుకు నేతల ప్రయత్నాలు
    •  గల్లీగల్లీ తిరుగుతున్న నేతలు
    • కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లోనే క్యూ లైన్లు
    •  చాలాచోట్ల ఖాళీగా కనిపిస్తోన్న పోలింగ్‌ బూత్‌లు
  • 11 Nov 2025 10:14 AM (IST)

    పోలీసులపై బీఆర్ఎస్ అభ్యర్థి ఫైర్..

    • బోరబండ స్వరాజ్‌‌నగర్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పర్యటన
    • పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న సునీతను అడ్డుకున్న పోలీసులు
    • ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని పోలీసుల ఆదేశం
    • పోలీసుల తీరుపై మాగంటి సునీత ఆగ్రహం
    • పోలీసులతో వాగ్వాదానికి దిగిన సునీత
    • బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు కొట్టారన్న సునీత
  • 11 Nov 2025 10:04 AM (IST)

    కాంగ్రెస్ నేతలు దాడులు చేస్తున్నారు – దీపక్ రెడ్డి

    • కాంగ్రెస్‌పై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి పలు ఆరోపణలు
    • BJYM కార్యకర్తలపై కాంగ్రెస్‌ నేతలు దాడికి దిగారు
    • ఎన్నికలకు ముందే దాడులు చేస్తున్నారు – దీపక్‌రెడ్డి
    • ఈవీఎంలో సీరియల్ నెంబర్‌ 1 సరిగ్గా లేదు
    • ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాం – దీపక్‌రెడ్డి
  • 11 Nov 2025 09:51 AM (IST)

    ఓటేసిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

    మధురానగర్‌లోని శ్రీనిధి విశ్వభారతి హైస్కూల్‌ పోలింగ్‌బూత్‌లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఓటేశారు. కుటుంబంతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు.

  • 11 Nov 2025 09:39 AM (IST)

    కాంగ్రెస్ నేతను పట్టుకున్న బీఆర్ఎస్

    • వెంగళరావునగర్‌లో కాంగ్రెస్ Vs బీఆర్ఎస్
    • కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
    • కాంగ్రెస్ నేతను పట్టుకుని అధికారులకు అప్పగించిన బీఆర్ఎస్ కార్యకర్తలు
  • 11 Nov 2025 09:31 AM (IST)

    గంటకు 5 శాతం చొప్పున పోలింగ్

    • జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్
    • ఉదయం 9 గంటల వరకు 9.2 శాతం పోలింగ్ నమోదు
    • గంటకు 5 శాతం చొప్పున నమోదైన పోలింగ్
    • ఓటర్లు తరలివచ్చి ఓటేయాలంటున్న అధికారులు, అభ్యర్థులు
  • 11 Nov 2025 09:18 AM (IST)

    9గంటల వరకు 9.2శాతం పోలింగ్..

    • మందకొడి పోలింగ్‌తో జూబ్లీహిల్స్ అభ్యర్థుల్లో గుబులు
    • 4 లక్షల మంది ఓటర్లున్నా ఉ.9 గంటలకు 9.2 శాతం మించని పోలింగ్
    •  2023లో 47.58 శాతానికే పరిమితమైన పోలింగ్
    •   ఓటర్లంతా బూత్‌లకు తరలివచ్చి ఓటు వేయాలని అభ్యర్థుల విజ్ఞప్తి
    •  జూబ్లీహిల్స్‌ 6 డివిజన్లలోని బస్తీల్లో పోలింగ్‌ కేంద్రాలకు ఓటర్ల క్యూ
    •  బస్తీలు మినహా మిగతా కాలనీల్లోని ఓటర్లలో కనిపించని ఉత్సాహం
    •  ఓటర్లను తరలించేందుకు 3 పార్టీల అభ్యర్థుల పాట్లు
    •  పోలింగ్‌ బూత్‌లకి వెళ్లేందుకు బస్తీల్లో ఫ్రీ ఆటో సదుపాయం
  • 11 Nov 2025 09:08 AM (IST)

    మందకొడిగా సాగుతున్న ఓటింగ్..

    జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. మందకొడిగా ఓటింగ్ సాగుతుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఉదయాన్నే ఎల్లారెడ్డిగూడ పోలింగ్ కేంద్రానికి వెళ్లి పరిశీలించారు. అక్కడే ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ యూసుఫ్‌గూడలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆరా తీశారు.  బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి షేక్‌పేటలో పోలింగ్ కేంద్రానికి వెళ్లి.. ఓటింగ్ సరళిని పరిశీలించారు.

  • 11 Nov 2025 08:55 AM (IST)

    ఓటేసిన తనికెళ్ల భరణి

    • యూసుఫ్‌గూడ గవర్నమెంట్ హైస్కూల్‌లో ఓటేసిన తనికెళ్ల భరణి దంపతులు
    • ఓటు అనేది ప్రజాస్వామ్యం ఇచ్చిన హక్కు – తనికెళ్ల భరణి
    •  ఓటు వేయని వారికి ప్రశ్నించే హక్కు ఉండదు
    • యువత బయటకు వచ్చి ఓటు వేయాలి.. పోలింగ్ శాతాన్ని పెంచాలి – తనికెళ్ల భరణి
  • 11 Nov 2025 08:44 AM (IST)

    ఓటేసిన రాజమౌళి

    • జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు
    • షేక్‌పేట డివిజన్ పోలింగ్ బూత్ నెం.28లో ఓటు వేసిన డైరెక్టర్ రాజమౌళి
    • ఫ్యామిలీతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్న దర్శకధీరుడు
  • 11 Nov 2025 08:25 AM (IST)

    ఎమ్మెల్యే భర్తపై బీఆర్ఎస్ ఫిర్యాదు

    • వెంగళరావు నగర్‌లోనూ స్వల్ప ఉద్రిక్తత  
    • సత్తుపల్లి ఎమ్మెల్యే భర్త దయానంద్‌పై ఆర్వోకి ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ నేతలు
    • ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపణ
    • బీఆర్ఎస్ ఆరోపణలను కొట్టిపారేసిన దయానంద్

  • 11 Nov 2025 08:20 AM (IST)

    షేక్‌పేట్‌ డివిజన్‌లో ఉద్రిక్తత

    • షేక్‌పేట్‌ డివిజన్‌లో కాసేపు ఉద్రిక్తత
    • పోలీసులతో కాంగ్రెస్ నేత సత్యనారాయణ వాగ్వాదం
    • BRS ఏజెంట్లను బూత్‌లోకి పంపి తనను అడ్డుకున్నారని ఆగ్రహం
    • పోలీసులు సర్ది చెప్పడంతో సద్దుమణిగిన గొడవ

  • 11 Nov 2025 08:17 AM (IST)

    ఎర్రకోట కారు పేలుడు ఘటన కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

    ఎర్రకోట కారు పేలుడు ఘటన కొనసాగుతున్న పోలీసుల దర్యాప్తు

    బదర్‌పూర్ సరిహద్దు ఎర్రకోట పార్కింగ్ స్థలం వరకు, ఔటర్ రింగ్ రోడ్ నుండి కాశ్మీరీ గేట్- ఎర్రకోట వరకు ఉన్న మార్గంలోని అనేక CCTV కెమెరాల ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు

    అనేక మార్గాల్లో CCTV ఫుటేజ్‌లను పరిశీలించిన దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది

    వివిధ ప్రదేశాల నుండి వచ్చిన CCTV ఫుటేజ్ ఆధారంగా, సుమారు 13 మందిని అనుమానితులుగా ప్రశ్నిస్తున్న పోలీసులు

    ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధం ఉన్న డాక్టర్ ఉమర్ I20లో ఉన్నట్లు అనుమానిస్తున్న పోలీసులు

  • 11 Nov 2025 08:11 AM (IST)

    ఈ సారి ఓటింగ్ శాతం పెరుగుతుంది – నవీన్ యాదవ్

    • జూబ్లీహిల్స్ ఓటర్లంతా ఓటు వేయాలని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజ్ఞప్తి
    • గతం కంటే ఈ సారి 10 నుంచి 15శాతం పోలింగ్ పెరగొచ్చు
    •  45 నిమిషాల్లోనే ఒక బూత్‌లో 60 నుంచి 70 ఓట్లు పోలయ్యాయి
    •  65 శాతానికి పైగా పోలింగ్ నమోదయ్యే అవకాశం
    •  ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు – నవీన్ యాదవ్
    •  యువత భవిష్యత్తు, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఓటేయండి
  • 11 Nov 2025 08:01 AM (IST)

    ప్రశాంతంగా పోలింగ్ : కర్ణన్..

    పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుందని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారి కర్ణన్‌ తెలిపారు. 11 ప్రాంతాల్లో ఈవీఎంల సమస్య తలెత్తగా.. రిజర్వ్‌ ఈవీఎంలను రీప్లేస్‌ చేశామన్నారు. ప్రతీ ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కర్ణన్ పిలుపునిచ్చారు.

  • 11 Nov 2025 07:45 AM (IST)

    11 చోట్ల మొరాయించిన ఈవీఎంలు

    • 11 చోట్ల మొరాయించిన ఈవీఎంలు
    •  సరిచేసే ప్రయత్నంలో టెక్నికల్‌ సిబ్బంది
    • బోరబండలో మొరాయించిన ఈవీఎం
    • షేక్‌పేట్‌ డివిజన్‌లో మొరాయించిన ఈవీఎం
    • పోలింగ్ బూత్-30లో ఈవీఎం మొరాయింపు
    • ఈవీఎంలో తలెత్తిన సాంకేతిక సమస్య
    • రహమత్‌నగర్ పోలింగ్ బూత్ 165 ,166 లో మొరాయించిన ఈవీఎం
    • క్యూ లైన్ లో వేచి చూస్తున్న ఓటర్లు
    • రిజర్వ్ ఈవీఎం తీసుకొచ్చిన అధికారులు
  • 11 Nov 2025 07:35 AM (IST)

    శ్రీనగర్ కాలనీలో నిలిచిన పోలింగ్..

    శ్రీనగర్ కాలనీలో పోలింగ్ నిలిచిపోయింది. నాగార్జున కమ్యూనిటీ కాలనీలో పవర్ కట్ అయ్యింది. దీంతో ఓటర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.

  • 11 Nov 2025 07:25 AM (IST)

    మొరాయించిన ఈవీఎంలు..

    షేక్‌పేట డివిజన్‌లో ఈవీఎం మొరాయించింది. పోలింగ్ బూత్‌ 30లోని ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తింది. సమస్యను పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. రహమత్ నగర్‌ డివిజన్‌లోని 165, 166 పోలింగ్ బూత్‌లో ఈవీఎంలు మొరాయించాయి. దీంతో ఓటర్లు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు.

  • 11 Nov 2025 07:16 AM (IST)

    ఓటు వేసిన బీఆర్ఎస్ అభ్యర్థి..

    జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఓటు హక్కు వినియోగించుకున్నారు. నవోదయ కాలనీ పోలింగ్ బూత్‌లో ఆమె తన పిల్లలతో కలిసి ఓటు వేశారు.

  • 11 Nov 2025 07:01 AM (IST)

    జూబ్లీహిల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభం..

    జూబ్లీహిల్ ఉపఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 58 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  ఈ నియోజకవర్గంలో మొత్తం 4,01,365 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 2,08,561, మహిళలు 1,92,779, ఇతరులు 25 మంది ఉన్నారు. ఎన్నికల కమిషన్ 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. దాదాపు 5,000 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. 1,761 మంది హైదరాబాద్ సిటీ పోలీస్ బలగాలతో పాటు, అదనంగా 800 మంది కేంద్ర పోలీస్ బలగాలను రంగంలోకి దించారు.

    లైవ్ ఇక్కడ చూడండి..

  • 11 Nov 2025 06:45 AM (IST)

    కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ

    — ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ

    — 4లక్షల 1365మంది ఓటర్లు.. 407 పోలింగ్ కేంద్రాలు

    — 65 ప్రాంతాల్లో 226 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు..

    — వెబ్‌కాస్టింగ్.. డ్రోన్లతో నిఘా.. పారామిలిటరీతో బందోబస్తు

  • 11 Nov 2025 06:38 AM (IST)

    నిఘా పెట్టిన అధికారులు

    గొడవలకు, దొంగ ఓట్లకు తావులేకుండా నిఘా పెట్టారు అధికారులు. డ్రోన్ల ద్వారా సెక్యూరిటీ మానిటిరింగ్‌ చేస్తున్నారు. EVMలు మొరాయిస్తే బ్యాకప్‌ కూడా ఏర్పాటు చేశామన్నారు ఎన్నికల అధికారులు

  • 11 Nov 2025 06:35 AM (IST)

    అన్ని డివిజన్లకు పోలింగ్‌ మెటీరియల్

    యూసఫ్ గూడ కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి స్టేడియం నుంచి అన్ని డివిజన్లకు పోలింగ్‌ మెటీరియల్ చేరుకుంది. 5 వేల మంది సిబ్బంది ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్నారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్.

  • 11 Nov 2025 06:35 AM (IST)

    పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్

    — 139 ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్

    — పోలింగ్ ముగిసేవరకు వైన్స్ బంద్

    — 407 పోలింగ్‌ కేంద్రాల్లో ఇవాళ పోలింగ్ జరగనుంది.

  • 11 Nov 2025 06:30 AM (IST)

    జూబ్లీహిల్స్‌ ఓట్ల జాతర..

    — ఓటింగ్‌కి వేళయ్యింది. మరికాసేపట్లోనే జూబ్లీహిల్స్‌ ఓట్ల జాతర మొదలుకానుంది.

    — వేలాదిమంది సిబ్బందితో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌కి సర్వంసిద్ధమైంది

    — ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు ఓటింగ్‌

    — జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో 58మంది అభ్యర్థులు

Published On - Nov 11,2025 6:27 AM

రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్
కోహ్లీ 53వ సెంచరీకి ఫిదా.. అనుష్క శర్మ పోస్ట్ వైరల్