Hyderabad: అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా అరెస్టు.. కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా..

|

Dec 12, 2022 | 12:16 PM

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫీయా గుట్టురట్టయింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

Hyderabad: అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠా అరెస్టు.. కొరియర్‌ ద్వారా విదేశాలకు సరఫరా..
drugs Seize
Follow us on

తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫీయా గుట్టురట్టయింది. హైదరాబాద్‌లో అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు. మల్కాజ్‌గిరిలో ఎస్‌వోటీ పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నుంచి 8 కిలోల ఎపిడ్రిన్‌ డ్రగ్స్‌‌ను మల్కాజిగిరి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ విలువ రూ.10 కోట్లు ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. హైదరాబాద్‌ నుంచి కొరియర్‌ ద్వారా విదేశాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. న్యూయర్‌ వేడుకల కోసం భారీగా డ్రగ్స్‌ సరఫరా భారీగా జరిగినట్టు అధికారులు గుర్తించారు.

కాగా, హైదరాబాద్‌ కేంద్రంగా కొరియర్‌ ద్వారా విదేశాలకు డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు రాచకొండ పోలీసులు పేర్కొంటున్నారు. న్యూఇయర్‌ వేడుకలు దగ్గరపడుతుండటం, ఇంత పెద్ద మొత్తంలో డ్రగ్స్‌ లభించడం హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఈ ముఠా వెనుక కీలక సూత్రధారులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇప్పటికే.. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ మాఫియాను అరికట్టేందుకు పోలీసులు పకడ్బంధీ ప్రణాళికలను అనుసరిస్తున్నారు. ఇటీవల దాడులను సైతం తీవ్రతరం చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..