MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పెరిగిన ఎంఎంటీఎస్‌ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

|

Dec 06, 2021 | 7:27 PM

MMTS: హైదరాబాదీలకు ఎంతగానో ఉపయోగపడే వాటిలో ఆర్టీసీ బస్సుల తర్వాత ఎంఎంటీఎస్‌లదే స్థానం. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ కంటే తక్కువ ఖర్చు ఉండే ఈ ప్రయాణానికి పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకుంటారు. అయితే..

MMTS: రైల్వే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌.. పెరిగిన ఎంఎంటీఎస్‌ సర్వీసులు.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Mmts Hyderabad
Follow us on

MMTS: హైదరాబాదీలకు ఎంతగానో ఉపయోగపడే వాటిలో ఆర్టీసీ బస్సుల తర్వాత ఎంఎంటీఎస్‌లదే స్థానం. ఇంకా చెప్పాలంటే ఆర్టీసీ కంటే తక్కువ ఖర్చు ఉండే ఈ ప్రయాణానికి పెద్ద ఎత్తున ప్రజలు ఉపయోగించుకుంటారు. అయితే కరోనా సమయంలో ఆగిపోయిన ఈ రైల్వే చాలా కాలం పాటు అలాగే ఆగిపోయాయి. అయితే తర్వాత ప్రజల నుంచి వస్తోన్న డిమాండ్ల మేరకు తిరిగి సేవలను ప్రారంభించారు.

అయితే వీటిని కొన్ని సర్వీసులకు మాత్రమే పరిమితం చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ప్రయాణికులకు గుడ్‌ న్యూస్‌ చెబుతూ మరిన్ని సర్వీసులను పెంచారు. పెంచిన ఈ సర్వీసులు సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఇందులో భాగంగా లింగంపల్లి-ఫలక్‌నుమా, హైదరాబాద్‌-లింగంపల్లి, సికింద్రాబాద్‌-హైదరాబాద్‌ మధ్య నడిచే రైళ్ల సంఖ్య 79కి చేరింది. ఈ సేవలకు సంబంధించిన పూర్తి వివరాలు..

హైదరాబాద్‌ నుంచి లింగంపల్లి..

ఉదయం 5 :40, 6 :40, 7 :55, 9 :00, 10 :00, 10 :55, 11 :35, మధ్యాహ్నం 12 :20, 1 :00, 2 :00, 3 :00, 3 :35, సాయంత్రం 4 :30, 5 :20, 6 :55, రాత్రి 7 :55, 10 :15 గంటలకు ఎంఎంటీఎస్‌లు బయలుదేరుతాయి.

లింగంపల్లి నుంచి ఫలక్‌నుమా..

ఉదయం 5 :50, 6 :10, 6 :50, 8 :25, 90 :5, 10,05, 11 :20, 11 :40, మధ్యాహ్నం 12 :40, 1 :25, 2 :40, 3 :10, సాయంత్రం 4 :40 5 :10, 5 :30, 6 :00, 6 :35, 7 :55, రాత్రి 9 :00, 9 :15, 9 :45 గంటలకు ఎంఎటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి. లింగంపల్లి నుంచి సికింద్రాబాద్‌కు అదనంగా రాత్రి 10 :20, 11 :25 గంటలకు కూడా ఉన్నాయి.

ఫలక్‌నుమా నుంచి లింగంపల్లికి..

ఉదయం 4 :45, 6 :30, 7 :25, 8 :30, 8 :50, 10 :02, 11 :00, 11 :42, మధ్యాహ్నం 1 :00, 1 :30, 3 :00, 3 :50, 4 :15 గంటలకు, సాయంత్రం 5 :15, 6 :17, 7 :10,       7 :30 గంటలకు, రాత్రి 8 :00, 8 :40 11 :05, 11 :35 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

లింగంపల్లి నుంచి హైదరాబాద్‌కు..

ఉదయం 6 :40, 7 :40, 8 :10, 9 :15, 10 :15, 11 :10, 11 :55, మధ్యాహ్నం 12 :50, 1 :20, 2 :25, 3 :30, సాయంత్రం 4 :10, 5 :55, 6 :55, రాత్రి 8 :05, 9 :25 గంటలకు ఎంఎంటీఎస్‌ రైళ్లు బయలుదేరుతాయి.

Also Read: డ్రైనేజ్‌ పైపుల్లో దాచిన రూ. 500 కట్టలు బంగారం !! వీడియో

Ajaz Patel: 22 ఏళ్ల తర్వాత మళ్లీ అద్భుతం జరిగింది.. అది ఎవరు చేశారంటే..

Sourav Ganguly: రాహుల్ ద్రవిడ్‎ను ఒప్పించడం అంత సులభం కాలేదు.. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ..