హైద‌రాబాద్‌లో దారుణం.. భవనంపై నుంచి దూకి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆఫీసర్‌ సూసైడ్‌!

ఆదాయపు పన్ను శాఖ లేడీ ఇన్‌స్పెక్టర్‌ శనివారం సికింద్రాబాద్‌లోని సీజీవో టవర్స్‌ 8వ అంతస్తు నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అక్కడి సెక్యూరిటీ సిబ్బంది పరుగుపరుగున వచ్చినా ప్రయోజనం లేకపోయింది..

హైద‌రాబాద్‌లో దారుణం.. భవనంపై నుంచి దూకి ఆదాయ‌పు ప‌న్ను శాఖ ఆఫీసర్‌ సూసైడ్‌!
Income Tax Official

Updated on: Apr 05, 2025 | 5:59 PM

హైద‌రాబాద్, ఏప్రిల్ 5: ఆకర్షణీయమైన జీతం, చక్కని జీవితం.. వీటన్నింటినీ కాదనుకుని ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఓ అధికారిణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్‌లోని కవాడిగూడలోని సీజీవో టవర్స్‌పై నుంచి దూకి మహిళా అధికారిని ఆత్మహత్య చేసుకుంది. అసలేం జరిగిందంటే.. గాంధీనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని సీజీవో టవర్స్‌లో ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్‌గా జయలక్ష్మి (52) విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఈ రోజు (ఏప్రిల్ 5) సెలవు అయినప్పటికీ ఆమె ఆఫీస్‌కు వచ్చారు. అనంతరం ఉద‌యం 11:15 సమయంలో సీజీవో టవర్స్‌ పైకి ఎక్కి కిందకి దూకేసింది.

సీజీవో టవర్స్‌ 8వ అంతస్థు నుంచి నుంచి ఆమె దూకడంతో తలకు తీవ్ర గాయాలై ఆమె అక్కడికక్కడే మృతిచెందారు. వెంటనే సీజీవో టవర్స్‌ సిబ్బంది గాంధీనగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న గాంధీనగర్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విజయ లక్ష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్లూస్‌ టీంతో ఘటనా స్థలంలో వివరాలు సేకరించారు.

ప్రాథమిక సమాచారం మేరకు ఆదాయ పన్ను శాఖ అధికారిని విజయలక్ష్మి గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఎన్నిచోట్ల చికిత్స తీసుకున్నప్పటికీ ఆమెకు నయం కాలేదు. దీంతో తీవ్ర మనస్థాపం చెందిన విజయ లక్ష్మి.. ఈ రోజు సెలవు దినం కావడంతో కార్యాలయం 8వ అంతస్తుకు చేరుకుని, అక్కడి నుంచి కిందకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై ఇంకా పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.