Innovation Express 2021 Award: ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2021 అవార్డుకు దక్కించుకున్న హైదరాబాద్‌ వాసి

Innovation Express 2021 Award: దేశ వ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన పది మంది వ్యక్తులు ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవార్డును అందుకున్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం..

Innovation Express 2021 Award: ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ 2021 అవార్డుకు దక్కించుకున్న హైదరాబాద్‌ వాసి

Updated on: Feb 27, 2021 | 9:15 PM

Innovation Express 2021 Award: దేశ వ్యాప్తంగా వినూత్న ఆవిష్కరణలు చేసిన పది మంది వ్యక్తులు ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవార్డును అందుకున్నారు. జాతీయ సైన్స్‌ దినోత్సవం సందర్భంగా శనివారం అగస్త్య ఇంటర్నేషనల్‌ ఎక్స్‌ప్రెస్‌ పోటీలు-2021ని నిర్వహించాయి. ఈ పోటీలలో వివిధ రాష్ట్రాలకు చెందిన 450 ఆవిష్కరణలు పోటీలలో ఉండగా, అత్యద్భుతమైన ఆవిష్కరణలుగా నిలిచిన మొదటి 10 మందికి ఆవిష్కర్తలకు నిర్వాహకులు అవార్డులు అందజేశారు.

అవార్డు అందుకున్న హైదరాబాదీ:

కాగా, ఈ ఇన్నోవేషన్‌ ఎక్స్‌ప్రెస్‌ అవార్డు సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన అవినాష్‌ గండి, ఇతర రాష్ట్రాలకు చెందిన గౌరవ్‌ నరుల, దర్శన్‌ ఎమ్‌, రాహుల్‌ పాటిల్‌, గణేష్‌, డి.ఎన్‌, మంజునాథ్‌, మృత్యుంజయుడు డికే. మురళీకృష్ణ, మలలూర్‌, అహిపతి, రుబిని పుల్లెడి, సూచన్‌ ఖడే, జితేష్ కుమార్ యాదవ్, సంజన్ పిబి, మెర్విన్ మాథ్యూస్, కాంచన ఖతన, శంషాంక్ ఎస్ కాంబ్లె, దృష్టి హన్స్ ల ఆవిష్కరణలు మొదటి పది స్థానాల్లో నిలిచాయి. అలాగే దైనందిన జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు కొత్త తరహా ఆవిష్కరణలు చేసిన మొదటి 30 మంది గ్లోబల్‌ షాల నుంచి స్కాలర్‌ షిప్‌లను అందుకోనున్నారు.

కోవిడ్‌-19ను అరికట్టేందుకు అవినాష్‌ వినూత్న ఆవిష్కరణ:

కాగా, హైదరాబాద్‌కు చెందిన రోబోటిక్స్‌ ఇంజనీర్‌ అవినాష్‌ గండి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ స్మార్ట్‌ అల్ట్రా జెర్మీసిడల్‌ ఇర్రాడియేషన్‌ డివైస్‌- ఇన్ఫినిటీ 360 ను రూపొందించారు. పరికరం కరోనాకు వ్యతిరేకంగా పని చేస్తుంది. వివిధ వాట్ల, ఎనిమిది యూవీ-రే ఉద్గార లైట్లను కలిగి ఉన్న ఈ పరికరం ఒక నిమిషం నుంచి ఐదు నిమిషాల్లో ఒక గదిని క్రిమిసంహారకం చేస్తుంది. మొబైల్‌ అనువర్తనంతో దీనిని ఆన్‌ చేసే సదుపాయం కూడా ఉంది. దీని ద్వారా ఎవరూ నేరుగా యూవీ కాంతికి గురికాకుండా ఉంటారు. మానవ కదలికలను గుర్తించాడానికి దీనికి నాలుగు సెన్సార్లు కూడా ఏర్పాటు చేశారు. ఏదైనా కదలిక ఎదురైతే ప్రమాదకర యూవీ కిరాణాలు మనిషిపై పడకుండా స్విచ్‌ ఆఫ్‌ ఆవుతుందని అవినాష్‌ వివరించారు. అవినాష్‌ తయారు చేసిన పరికరానికి ఎంతో పేరొచ్చింది. అవినాష్‌ ఈ ఇన్నోవేషన్‌ ఎక్స్‌ ప్రెస్‌ అవార్డు 2021కు ఎంపిక కావడం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ అవార్డు దక్కించుకోవడం వల్ల ఇలాంటివి ఎన్నో ఆవిష్కరణలు చేయడానికి ఉత్సాహం చూపుతానని అన్నారు.

ఇవి చదవండి:

Kanipakam: కాణిపాకం వినాయకుడికి ఓ భక్తుడు రూ. 7 కోట్ల విరాళం.. భక్తుడి పేరు మాత్రం చెప్పలేదు.. ఎందుకంటే..

డ్రైవింగ్ లైసెన్స్ కష్టాలకిక చరమగీతం.. లైసెన్స్ పునరుద్ధరణ, డూప్లికేట్ లైసెన్స్‌, అడ్రస్ చేంజ్ వంటివన్నీ ఇక మేడ్ ఈజీ