AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ఇష్టంగా తిన్న మోమోస్‌ ఆమె ఉసురు తీశాయి.. మరో 50 మంది..

హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. మోమోస్‌ తిని మహిళ మృతి చెందింది. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన బంజారాహిల్స్‌ పీఎస్‌ పరిధిలో వెలుగుచూసింది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి...

Hyderabad: ఇష్టంగా తిన్న మోమోస్‌ ఆమె ఉసురు తీశాయి.. మరో 50 మంది..
Reshma - Momo's
Ram Naramaneni
|

Updated on: Oct 28, 2024 | 3:22 PM

Share

బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో విషాదం చోటు చేసుకుంది. స్ట్రీట్ ఫుడ్ తిని ఓ మహిళ మృతి చెందింది. పలువురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రతీ వారంలాగే ఈ వారం కూడా నందినగర్‌లో మార్కె‌ట్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మోమోస్‌ను పలువురు ఇష్టంగా కొనుక్కుని తిన్నారు. మోమూస్‌ను ఇష్టంగా తిని ఇంటికి వెళ్లిన తర్వాత హఠాత్తుగా వారంతా వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అనారోగ్యానికి గురైనవారిని కుటుంబసభ్యులు స్థానిక ఆస్పత్రులకు తరలించారు. సుమారు 50 మంది అస్వస్థతకు లోనైనట్లు సమాచారం.

మోమోస్‌ తినడంతో సింగాడకుంట బస్తీకి చెందిన రేష్మ అనే 29 ఏళ్ల మహిళ కూడా అస్వస్థతకు గురవడంతో కుటుంబీకులు ఆమెను నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా మారడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. స్ట్రీట్ ఫుడ్ తిని రేష్మ మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై చాలా మంది బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మోమోస్‌ తిన్నవారిలో దాదాపు 10 మంది మైనర్లు ఉన్నట్లు తెలిసింది.

బాధితులు చేసిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మోమోస్ విక్రయించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  అయితే మోముస్‌ను ఎలా తయారు చేశారు.. ఇందులో ఏమైనా కలిసిందా.. లేక మోముస్ తయారీలో ఏమైనా నాసిరక పదార్థాలు ఉపయోగించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
50 గంటల బ్యాటరీ, అదిరిపోయే ఫీచర్లతో వైర్‌లెస్ ఇయర్‌బడ్స్‌
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
కుప్పం అభివృద్ధిలో మరో మైలురాయి : చంద్రబాబు
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
ముంచుకొస్తున్న ఆర్నాబ్ తుఫాన్.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
దద్దరిల్లిపోయిన ఎపిసోడ్.. సుధీర్ వర్సెస్ సృష్టి..
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
మిగిలిపోయిన అన్నంతో చుక్క నూనె లేని హెల్దీ బ్రేక్‌ఫాస్ట్‌.. రుచి
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
Xiaomi కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ స్పెషలిటీస్ ఏంటో తెలుసా?
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
సముద్రంలోనే పంటలు.. ఉప్పు నీటితో మంచినీరు..!
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
పడిపోతున్న బంగారం, వెండి ధరలు.. రెండు రోజుల్లో ఎంత తగ్గిందంటే..
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
రాశిఫలాలు: వీరికి ఉద్యోగం, పెళ్లి, ఆదాయం విషయాల్లో గుడ్‌న్యూస్
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..
పరివర్తిని ఏకాదశి.. ఈ ఒక్క రోజు ఇలా పూజ చేస్తే.. లక్ష్మీకటాక్షం..