Hyderabad: ‘అయ్యో.. ఎంతపని చేశావ్‌ తల్లీ!’ కుమారుడు సీఏ పరీక్షలో తప్పాడని తల్లి ఆత్మహత్య

|

Aug 10, 2023 | 10:09 AM

జీడిమెట్ల పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త నాగభూషణం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పుష్పజ్యోతి గృహిణి. వీరి కుమారుడు ఇటీవల ఓ ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షకు హాజరయ్యాడు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదయ్యాయి. అయితే ఆ పరీక్షలో పుష్పజ్యోతి కుమారుడు..

Hyderabad: అయ్యో.. ఎంతపని చేశావ్‌ తల్లీ! కుమారుడు సీఏ పరీక్షలో తప్పాడని తల్లి ఆత్మహత్య
Pushpa Jyothi
Follow us on

జీడిమెట్ల, ఆగస్టు 10: కుమారుడు పరీక్షలో ఫెయిల్‌ అయ్యాడని మనస్తాపం చెందిన ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. హైదరాబాద్‌లోని జీడిమెట్లలో బుధవారం (ఆగస్టు 9) ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. జీడిమెట్ల ఇన్‌స్పెక్టర్‌ ఎం పవన్‌ తెలిపిన వివరాల ప్రకారం..

జీడిమెట్ల పరిధిలోని గాజులరామారంలోని బాలాజీ ఎన్‌క్లేవ్‌లో నాగభూషణం, పుష్పజ్యోతి(41) దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. భర్త నాగభూషణం ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్య పుష్పజ్యోతి గృహిణి. వీరి కుమారుడు ఇటీవల ఓ ఛార్టర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) పరీక్షకు హాజరయ్యాడు. ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలు తాజాగా విడుదయ్యాయి. అయితే ఆ పరీక్షలో పుష్పజ్యోతి కుమారుడు ఉత్తీర్ణత సాధించలేకపోయాడు. దీంతో తల్లి పుష్పజ్యోతి తీవ్ర మానసికంగా ఒత్తిడికి లోనైంది. కుమారుడి భవిష్యత్తు ఏమైపోతుందనే బెంగ పెట్టుకుని కుమిలిపోయింది.

ఈ క్రమంలో ఆమె బుధవారం ఉదయం (ఆగస్టు 9) ఇంట్లో ఎవరూ లేని సమయంలో బెడ్‌రూంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు గమనించేప్పటికే ఆమె ఫ్యాన్‌కు విగత జీవిగా వేలుడుతూ కనిపించింది. కుటుంబ సభ్యుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఇన్‌స్పెక్టర్‌ ఎం పవన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

నాగ్‌పుర్‌లో మరో ఘటన.. టీవీ సెట్‌టాప్‌ బాక్సు షాక్‌ కొట్టి చిన్నారి మృతి

టీవీ సెట్‌టాప్‌ బాక్సు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురై నాలుగేళ్ల చిన్నారి మృతిచెందాడు. ఆ విషాద ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌ జిల్లా హింగ్నా పోలీస్‌స్టేషను పరిధిలో చోటుచేసుకుంది. అప్పటిదాకా కళ్లముందు అల్లరి చేస్తూ కేరింతలు కొట్టిన చిన్నారి ఒక్కసారిగా విగతజీవిగా మారడం చూసిన తల్లిదండ్రులు గుండెలవిసేలా విలపించారు. ఈ ఘటన ఆగస్టు 8న చోటుచేసుకోగా బుధవారం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.