Hyderabad: ఇది కదా కావాల్సింది.. 2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్..
2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్‌ను మార్చేలా విజన్ రూపొందించింది ప్రభుత్వం. నగరంలో కాలుష్య రహిత రహదారులు, హుస్సేన్ సాగర్ 2.0, సైక్లింగ్ అండ్ వాకింగ్ లూప్స్, ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లాంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.

2047 నాటికి హైదరాబాద్ మహానగరం.. ప్రపంచానికే ఐకానిక్‌గా ఉండాలి. ఏ రంగంలో చూసుకున్నా హైదరాబాదే మోడల్‌గా ఉండాలంటూ విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించింది రేవంత్ సర్కార్. మూసీ పునరుజ్జీవం దగ్గర నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు అన్నింటి కోసం సమగ్రమైన ప్రణాళికను తయారుచేసింది. విశ్వనగరాన్ని మరింత విశ్వవ్యాప్తం చేస్తామంటోంది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ సర్కార్.
హైదరాబాద్ ఎంతగా అభివృద్ధి చెందితే.. తెలంగాణ రూపురేఖలు అంత వేగంగా మారిపోతాయి. నగరంలో రాబోమే సమూల మార్పులే తెలంగాణకు కీలకం. అందుకే.. హైదరాబాద్ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది ప్రభుత్వం. ORR లోపల ప్రాంతమంతా క్యూర్… అంటే కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ పేరుతో అభివృద్ధి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసింది రేవంత్ సర్కార్. ఈ ప్రాంతమంతా సర్వీస్ హబ్‌గా ఉండబోతోంది.
2047 నాటికి బ్లూ అండ్ గ్రీన్ సిటీగా హైదరాబాద్‌ను మార్చేలా విజన్ రూపొందించింది ప్రభుత్వం. నగరంలో కాలుష్య రహిత రహదారులు, హుస్సేన్ సాగర్ 2.0, సైక్లింగ్ అండ్ వాకింగ్ లూప్స్, ఎలాంటి అంతరాయం లేని రవాణా సౌకర్యం లాంటి కీలక ప్రాజెక్టులు ఉన్నాయి.
వరద నీటి నిర్వహణతో భూగర్భ జలాల పెంపు
నగరంలో నీటి వనరులను రీస్టోర్ చేసేందుకూ ప్రణాళికను రెడీ చేసింది. వరద నీటి నిర్వహణతో భూగర్భ జలాల పెంపు, వందకుపైగా చెరువుల అభివృద్ధి, నగరంలోని రోడ్లన్నీ పచ్చదనంతో నింపేయడం లాంటి కార్యక్రమాలు చేపడుతోంది ప్రభుత్వం.
MMTS, మెట్రో రైల్ విస్తరణ.. ఎయిర్ పోర్ట్‌కు మరింత కనెక్టివిటీ
ఇక రవాణా విషయానికి వస్తే.. MMTS, మెట్రో రైల్ విస్తరణ, ఎయిర్ పోర్ట్‌కు మరింత కనెక్టివిటీ, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్‌లో రవాణాపై ప్రత్యేక దృష్టి, IRR నుంచి ORR వరకు రేడియల్ రోడ్ నెట్ వర్క్, వెయ్యి కిలోమీటర్ల సైక్లింగ్ అండ్ వాకింగ్ కారిడార్స్ లాంటి ప్రాజెక్టులు కీలకం.
3డీ సిటీ మోడలింగ్
నగరంలోని కాలుష్య కారక ఫ్యాక్టరీలు ORR బయటకు పంపడంతో పాటు హైదరాబాద్‌లోని మ్యూజియం విస్తరణ, 3డీ సిటీ మోడలింగ్, ట్రాఫిక్ నియంత్రణ కోసం సెన్సార్ల వినియోగం, ఎలక్ట్రిక్ వాహనాల ప్రోత్సాహం, నగరంలోని హెరిటేజ్ ప్రదేశాల రక్షణ కూడా చేపట్టాలనేది ప్రభుత్వ సంకల్పం.
35 నుంచి 40 కిలోమీటర్ల పొడవునా ఈస్ట్ వెస్ట్ రివర్ ఫ్రంట్
మూసీకి పునరుజ్జీవం పోసేందుకు బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది. 35 నుంచి 40 కిలోమీటర్ల పొడవునా ఈస్ట్ వెస్ట్ రివర్ ఫ్రంట్‌ను డెవలప్ చేయడమే ప్రధాన లక్ష్యం. మూసీ పరిసరాలను విహార, వినోద, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చబోతోంది ప్రభుత్వం. మూసీ పరిసరాల్లో పార్క్‌లు, ఫుట్ పాత్‌లను అభివృద్ధి చేయబోతోంది.
100శాతం మురుగు నీటి శుద్ధి
నగరంలో 100శాతం మురుగు నీటి శుద్ధి చేయడం కూడా విజన్ 2047లో భాగం. దీని కోసం 2027 నాటికి డీపీఆర్ సిద్ధం చేస్తామంటోంది ప్రభుత్వం.
డీప్‌టెక్, ఏఐ, ఇండస్ట్రీ 40, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్
టెక్నాలజీకి గ్లోబల్ సెంటర్‌గా హైదరాబాద్‌ను మార్చబోతోంది ప్రభుత్వం. డీప్‌టెక్, ఏఐ, ఇండస్ట్రీ 40, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, R&D సర్వీసులు, డిజైన్ స్టూడియోలు, పారిశ్రామిక వేత్తలను బలోపేతం చేయడంతో పాటు హై వాల్యూ సేవల కోసం స్టార్టప్ ఎకో సిస్టమ్‌ను బిల్డ్ చేయబోతోంది.
నగర జీడీపీని 600 బిలియన్ డాలర్లు
గ్లోబల్ సర్వీసెస్ క్యాపిటల్‌గా హైదరాబాద్‌ను అభివృద్ధి చేస్తోంది ప్రభుత్వం. ప్రస్తుతం 90 బిలియన్ డాలర్లుగా ఉన్న నగర జీడీపీని 600 బిలియన్ డాలర్లకు చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
