AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weather Alert: బాబోయ్.. వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..

చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దీంతో ఎముకలు కొరికే చలితో గజ గజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. వచ్చే మూడు రోజుల వాతావరణంపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది..

Weather Alert: బాబోయ్.. వచ్చే 3 రోజులు గజ గజ వణకాల్సిందే.. ఇదిగో లేటెస్ట్ వెదర్ రిపోర్ట్..
Weather Report
Shaik Madar Saheb
|

Updated on: Dec 10, 2025 | 11:39 AM

Share

చలి చంపేస్తోంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి.. దీంతో ఎముకలు కొరికే చలితో గజ గజ వణికిపోతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ.. వచ్చే మూడు రోజుల వాతావరణంపై కీలక అప్డేట్ ఇచ్చింది.. తెలంగాణలో రాబోయే మూడు రోజుల్లో చలిగాలులు వీచే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.. చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈశాన్య గాలులు బలపడటం వల్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతాయని.. ముఖ్యంగా ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5°C నుండి 7°C వరకు తగ్గుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌తో సహా మధ్య తెలంగాణలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C వరకు తగ్గే అవకాశం ఉందని పేర్కొంది.

పొడి గాలి, బలమైన ఈశాన్య గాలులు రాత్రిపూట చల్లదనాన్ని పెంచడమే దీనికి కారణమని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

అయితే, రాబోయే మూడు రోజులు తెలంగాణ అంతటా వాతావరణం పొడిగా ఉంటుంది.

అయితే.. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రిపూట, తెల్లవారుజామున అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, ఇప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు చలి సమయంలో బయటకు రాకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు.

మంగళవారం ఉష్ణోగ్రతలు ఇలా..

మంగళవారం కనిష్ట ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి.. ఆదిలాబాద్ 7.7°C, మెదక్ 8.5°C, పటాన్‌చెరు 8°C, రాజేంద్రనగర్ 10°C వద్ద అత్యంత శీతల ప్రాంతాలుగా నిలిచాయి. అలాగే.. భద్రాచలం 16.0°C, దుండిగల్ 13.1°C, హకీంపేట 14.4°C, హన్మకొండ 11.5°C, హైదరాబాద్ 13.0°C, ఖమ్మం 14.0°C, మహబూబ్ నగర్ 15.1°C, నల్గొండ°C1°C, రామబాద్ 15°C, హయత్ నగర్ 11.6°C. ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..