Hyderabad: మహా నగరం సిగలో మరో మణిహారం! ..10 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మాణానికి టెండర్‌ నోటిఫికేషన్‌..

|

Apr 13, 2022 | 9:02 PM

Hyderabad Underground Tunnel: మహానగరంలో మహా అధ్భుతానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణంతో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది

Hyderabad: మహా నగరం సిగలో మరో మణిహారం! ..10 కిలోమీటర్ల అండర్‌ గ్రౌండ్‌ టన్నెల్‌ నిర్మాణానికి టెండర్‌ నోటిఫికేషన్‌..
Hyderabad
Follow us on

Hyderabad Underground Tunnel: మహానగరంలో మహా అధ్భుతానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణంతో కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. పార్కుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా భూగర్భంలో సొరంగం మార్గం వేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. అంతా అనుకున్నట్లు సాగితే దేశంలోనే అతిపెద్ద సొరంగ మార్గానికి మన హైదరాబాద్ కేరాఫ్ అడ్రస్ గా మారనుంది. కాగా నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఫ్లైఓవర్లు, అండర్ పాస్ ల నిర్మాణంతో దూకుడుగా ఉన్న జీహెచ్ఎంసీ (GHMC) మరో వినూత్న ప్రయత్నానికి తెరతీసింది. దుర్గం చెరువు వద్ద కేబుల్ బ్రిడ్జి నిర్మాణంతో జూబ్లీహిల్స్ నుంచి ఐటీ కారిడార్ కు ఈజీ వే చేసిన బల్దియా.. కేబీఆర్ వద్ద మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే కేబీఆర్ పార్క్ ఎకో సెన్సిటివ్ జోన్ లో ఉండడంతో పార్క్ లోని ఒక్క చెట్టునుకు కూడా జీహెచ్ఎంసీ ముట్టుకోలేదు. కానీ బల్దియా మల్టీ లెవల్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరిగితే దాదాపు 1,500 చెట్లు కూల్చాల్సిన పరిస్థితి ఉంటుంది. దీంతో వేరే మార్గాలను అన్వేషించాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు సోరంగ మార్గాన్ని తవ్వితే ఎలా ఉంటుందన్న ఆలోచనలతో ఆచరణకు సిద్ధమైంది జీహెచ్‌ఎంసీ.

పర్యావరణానికి హాని కలగకుండా..

జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 నుంచి కేబీఆర్ పార్క్ లోపల నుంచి పార్క్ ఎంట్రీ వరకు అండర్ గ్రౌండ్ టన్నెల్.. అక్కడి నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ మీదుగా రోడ్ నంబర్ 12 వరకు సొరంగ మార్గాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇది సాధ్యమా కాదా అని అధ్యయనం చేసేందుకు ఏజెన్సీల నుంచి టెండర్లను ఆహ్వానించారు. ఇందులో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నం.45 నుంచి కేబీఆర్‌ పార్కు ఎంట్రీ వరకు 1.7 కి.మీ., కేబీఆర్‌ ఎంట్రీ పాయింట్ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్ వరకు 2. కి.మీ., బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12 టన్నెల్‌ జాయినింగ్‌ పాయింట్‌ 1.1 కి.మీ., మిగిలిన అప్రోచ్ రోడ్లు మొత్తం కలిపి సుమారు 10 కి.మీ. సొరంగ మార్గానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. నాలుగు లేన్ల రోడ్ నిర్మాణానికి ప్రణాళికలు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టును కూడా దుర్గం చెరువు నుంచి బంజారాహిల్స్ వరకు సులువుగా చెరుకునే మార్గానికి అనుసంధానంగా కొనసాగించనున్నారు. కేబీఆర్ పార్క్ నేషనల్ పరిధిలోకి వెళ్లడంతో అక్కడ పార్క్ లోని చెట్లకు ఇబ్బందులు కలగకుండా 30 మీటర్ల లోతున టన్నెల్ నిర్మించాలని భావిస్తున్నారు. అయితే 10 కిలోమీటర్ల ప్రతిపాదనలో ఎంతవరకు సాధ్యమైతే అంతవరకు చేపట్టేందుకు కూడా అధికారులు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపాదనలలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ జామ్ కు చెక్ పెట్టే మార్గాలనే అన్వేషించాలని.. పర్యావరణంపై తక్కువ ప్రభావం కలిగే విధంగా ప్రాజెక్టు చేపట్టాలని టెండర్ నోటిఫికేషన్‌లో సూచనలు జారీ చేశారు.

అతి పొడవైన టన్నెల్‌..

ఈ మహా సొరంగ ప్రాజెక్టు పట్టాలెక్కితే.. బంజారాహిల్స్, మినిస్టర్ క్వార్టర్స్, పంజాగుట్ట నుంచి ఐటీ కారిడార్ వైపు వెహికిల్స్ ఫ్రీగా రయ్ రయ్ అంటూ దూసుకుపోనున్నాయి. ఇప్పటికే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జితో కాస్త మెరుగుపడిన ట్రాఫిక్.. ఈ ప్రాజెక్టుతో కేబీఆర్ చుట్టుపక్కల ఆగే పనిలేకుండా నేరుగా వెళ్లేందుకు అవకాశం కలగనుంది. కేబీఆర్ పార్క్ చుట్టు ఉన్న 8 జంక్షన్లకు ట్రాఫిక్ సమస్యల నుంచి విముక్తి కలగనుంది. అంతేకాదు హైదరాబాద్ కు మరో ప్రతిష్టాత్మక టన్నెల్ గా నిలవనుంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్ లోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ టన్నెల్ 9.28 కిలోమీటర్లతో దేశంలోనే అతిపొడవైన సొరంగ మార్గంగా ఉంది. ఒకవేళ హైదరాబాద్ లో 10 కిలోమీటర్ల పొడవైన అండర్ గ్రౌండ్ టన్నెల్ నిర్మాణం సాధ్యమైతే దేశంలోనే అతి పొడవైన టన్నెల్ కు హైదరాబాద్ అడ్డాగా మారనుంది. కాగా ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను స్టడీ చేసేందుకు మే 2 వరకు టెండర్లు వేసేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత అర్హత ఉన్న ఏజెన్సీకి స్టడీ చేసేందుకు టెండర్ ఇస్తారు. 9 నెలల్లో ఏజెన్సీ స్టడీ చేసి నివేదిక ఇవ్వాల్సి ఉంటుంది. దాని ఆధారంగా డీపీఆర్ రూపొందించడం ఆ తర్వాత అంచనా వ్యయం లెక్కగట్టి నిర్మాణా పనుల్లోకి దిగుతారు.

Also Read:Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..

Alia-Ranbir Wedding: అలియా – రణ్‌బీర్‌ పెళ్లి సంగతులు తెలుసా?

NMDC Recruitment 2022: ఏడాదికి 29.58 లక్షల జీతంతో.. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు..