AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..

నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలను హ్యాండిల్ చేసిన అనిల్ రావిపూడి.. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు.

Anil Ravipudi : బాలయ్యతో తీయబోయే సినిమా ఎలా ఉంటుందో చెప్పేసిన అనిల్ రావిపూడి..
Anil Ravipudi
Rajeev Rayala
|

Updated on: Apr 13, 2022 | 7:25 PM

Share

నిన్నమొన్నటి వరకు మీడియం రేంజ్ హీరోలను హ్యాండిల్ చేసిన అనిల్ రావిపూడి(Anil Ravipudi ).. ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేసి సరిలేరు నీకెవ్వరు అనిపించుకున్నాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అనిల్.. ఆచితూచి సినిమాలు చేస్తున్నాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమాను కంప్లీట్ చేసే పనిలో పడ్డాడు అనిల్. గతంలో వెంకటేష్ వరుణ్ తేజ్ తో కలిసి ఎఫ్ 2 అంటూ సందడి చేశాడు. పెళ్ళాం పోరు భరించలేని భర్తలు అంటూ నవ్వులు పూయించాడు. ఇప్పుడు దానికి సీక్వెల్ గా ఎఫ్ 3 ని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో సునీల్  , సోనాల్ చౌహన్ ఇద్దరు కొత్తగా యాడ్ అయ్యారు. ఎఫ్ 2 కు మించి నవ్వులు పూయించే గ్యారెంటీ నాది అని ఇప్పటికే ఆడియన్స్ కు హామీ ఇచ్చిన అనిల్.. అదే పనిలో బిజీగా ఉన్నాడు. అలాగే నటసింహం బాలయ్య దగ్గర నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రాబట్టుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్.

బాలకృష్ణ ను డైరెక్ట్ చేయాలని చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు అనిల్. అటు బాలయ్య కూడా అఖండ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టి ఇప్పుడు గోపి చంద్ మలినేని సినిమా కోసం రంగంలోకి దిగారు. గోపీచంద్ సినిమా అయిపోయిన వెంటనే అనిల్ సినిమా సెట్ లో అడుగు పెట్టనున్నారు బాలయ్య. అయితే బాలకృష్ణ తో అనిల్ ఎలాంటి సినిమా చేస్తాడన్నది ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ లో మెదులుతున్న ప్రశ్న. బాలకృష్ణ అంటే యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు. కానీ అనిల్ తెరకెక్కించే సినిమాలు కామెడీ మిక్స్డ్ స్టోరీస్ దాంతో ఇప్పుడు అనిల్ బాలయ్యను ఎలా చూపించనున్నాడా అని ఆలోచిస్తున్నారు. తాజాగా అనిల్ మాట్లాడుతూ.. బాలకృష్ణగారి ఇమేజ్ కి భిన్నంగా వెళ్లకుండా, ఒక డిఫరెంట్ జోనర్లో ఈ కథను నడిపించాలని అనుకుంటున్నాను అని అన్నారు. అలాగే బాలకృష్ణ గారిని ఎలా చూడటానికి ప్రేక్షకులు ఇష్టపడతారో, అలా చూపించాలనే ఉద్దేశంతోనే ఉన్నాను. నా మార్కు ఎంటర్టైన్ మెంట్ ను ఎలాగో అలా యాడ్ చేస్తాను అని అనిల్ చెప్పుకొచ్చారు.

K.G.F Chapter 2: రిలీజ్‌కు రెడీ అయిన కేజీఎఫ్‌2…రాకీ భాయ్‌కి అక్కడ అరుదైన గౌరవం.. ఏకంగా

Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు

Sonal Chauhan: ప్రభాస్ సరసన బాలయ్య హీరోయిన్.. అదృష్టంగా భావిస్తున్నా అంటున్న అమ్మడు..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్