Hyderabad: నకిలీ సర్టిఫికెట్స్ దందాపై పోలీసులు ఉక్కు పాదం.. పలు కన్సల్టెన్సీల్లో తనిఖీలు..
Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం పై దూకుడు పెంచారు కేంద్ర , రాష్ట్ర పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు (Fake certificates) , నకిలీ డాక్యుమెంట్లు (Fake Documents) ప్రొడ్యూస్ చేసిన అభ్యర్థుల..
Hyderabad: నకిలీ సర్టిఫికేట్ల వ్యవహారం పై దూకుడు పెంచారు కేంద్ర , రాష్ట్ర పోలీసులు నకిలీ సర్టిఫికెట్లు (Fake certificates) , నకిలీ డాక్యుమెంట్లు (Fake Documents) ప్రొడ్యూస్ చేసిన అభ్యర్థుల భాగోతాన్ని బట్టబయలు చేశారు అమెరికా అధికారులు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు కన్సల్టెన్సీల (consultants) మీద తనిఖీలు చేసిన పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ కన్సల్టెన్సీ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు…అమెరికా వెళ్ళడానికి మేము సహకరిస్తాము అని చెప్పి విద్యార్థులను నమ్మించి ఫేక్ సర్టిఫికెట్స్ ను సృష్టించి వీసా ఇంటర్వ్యూలకు పంపుతున్నారు.. దీంతో ఇంటర్వ్యూలలో భాగంగా అసలు విషయాలు బయటకు వస్తున్నాయి..పూర్తి స్థాయిలో విచారణ చేస్తుండగా నకిలీ డాక్యుమెంట్లు చూపిస్తూ ఉద్యోగాల కోసం వెళ్తున్నారు అని తెలుసుకున్న అమెరికా అంబసి అధికారులు అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గత నెల 24 నుండి ఏప్రిల్ 10 వరకు ఢిల్లీ లో జరిగిన వీసా ఇంటర్వ్యూలో భాగంగా నకిలీ పత్రాలు దొరకడం తో అభ్యర్థులను ప్రశ్నించిన అమెరికా అధికారులు పూర్తి ఆధారాలు ఉండటంతో షాక్ గురి అయ్యారు…దీంతో అమెరికా అధికారులు ఢిల్లీ అధికారులకు తెలియచేయగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పోలీసుల సహాయంతో 3 రోజుల పాటు తనిఖీలు చేసి అనుమానితులను ఢిల్లీకి తరలించారు అధికారులు. ఎవరైనా వీసా కోసం ఇలాంటి నేరాలకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు పోలీసులు.
Reporter: Sravan. B Tv9 Telugu
Also Read: Assam: అస్సాంలో దారుణం.. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 24 గంటల్లో 13 మంది మృతి