AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Assam: అస్సాంలో దారుణం.. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 24 గంటల్లో 13 మంది మృతి

అస్సాంలో విషపూరితమైన పుట్టగొడుగులను తినడం వల్ల ఒక చిన్నారి సహా కనీసం 13 మంది మరణించారు.

Assam: అస్సాంలో దారుణం.. విషపూరితమైన పుట్టగొడుగులు తిని 24 గంటల్లో 13 మంది మృతి
Mushroom
Balaraju Goud
|

Updated on: Apr 13, 2022 | 9:24 PM

Share

Consuming Poisonous Mushroom: అస్సాంలో విషపూరితమైన పుట్టగొడుగులను తినడం వల్ల ఒక చిన్నారి సహా కనీసం 13 మంది మరణించారు. ఈ మేరకు బుధవారం అధికారులు సమాచారం అందించారు. డిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (AMCH) సూపరింటెండెంట్ ప్రశాంత్ దిహింగియా మాట్లాడుతూ అడవి పుట్టగొడుగులను తిన్న వారిలో ఎక్కువ మంది చికిత్స సమయంలో మరణించారు. పలువురు చికిత్స పొందుతున్నారని తెలిపారు. బాధితులందరినీ దిబ్రూగఢ్ జిల్లాలోని అస్సాం మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో చేర్చారు. బాధితులందరూ చికిత్స పొందుతూ మరణించారని ప్రశాంత దిహింగియా తెలిపారు. బాధితులు దిబ్రూగఢ్, టిన్సుకియా, శివసాగర్, చరైడియో జిల్లాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు.

తూర్పు అస్సాంలోని చరైడియో, దిబ్రూగర్, శివసాగర్ మరియు టిన్సుకియా జిల్లాల టీ గార్డెన్ కమ్యూనిటీకి చెందిన 35 మంది పుట్టగొడుగులను తిన్న తర్వాత అస్వస్థతకు గురై గత ఐదు రోజుల్లో AMCHలో చేరారని డిహింగియా చెప్పారు. . చేరిన 35 మందిలో గత 24 గంటల్లో 13 మంది చనిపోయారు.  మృతుల్లో ఏడుగురు చరైదేవ్‌ జిల్లా నుంచే ఉన్నారని, అందులో బాలుడు కూడా ఉన్నట్లు తెలిపారు. ఐదుగురు దిబ్రూగఢ్‌ జిల్లా, శివసాగర్‌కు చెందిన ఓ వ్యక్తి మరణించినట్లు వెల్లడించారు. ప్రతి సంవత్సరం అడవి పుట్టగొడుగులను తినడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారని, వారిలో కొందరు చనిపోతున్నారని చెప్పారు. ప్రజలు అడవి పుట్టగొడుగులను గుర్తించలేకపోయారు, ఇది హానికరమైనది తినదగినది కాదు. అడవి పుట్టగొడుగుల వినియోగానికి వ్యతిరేకంగా ప్రజలకు అవగాహన అవసరమని డిహింగియా అన్నారు.

Read Also… India GDP: భారత్‌ జీడీపీ అంచనాను తగ్గించిన వరల్డ్‌ బ్యాంక్.. 8.7 నుంచి 8 శాతానికి కుదింపు..