India GDP: భారత్ జీడీపీ అంచనాను తగ్గించిన వరల్డ్ బ్యాంక్.. 8.7 నుంచి 8 శాతానికి కుదింపు..
ప్రపంచ బ్యాంక్(World Bank).. భారత్ ఆర్థిక వృద్ధి(India GDP) అంచనాను తగ్గించింది. ఉక్రెయిన్(Ukraine Crisis) సంక్షోభం కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో వృద్ధి అంచనా తగ్గించినట్లు తెలుస్తుంది...
ప్రపంచ బ్యాంక్(World Bank).. భారత్ ఆర్థిక వృద్ధి(India GDP) అంచనాను తగ్గించింది. ఉక్రెయిన్(Ukraine Crisis) సంక్షోభం కారణంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణంతో వృద్ధి అంచనా తగ్గించినట్లు తెలుస్తుంది. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారత్ వృద్ధి అంచనాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 8.7% నుంచి 8%కి తగ్గించింది. ఆఫ్ఘనిస్తాన్ మినహా దక్షిణాసియాలో వృద్ధి అంచనాను 6.6%కి శాతం తగ్గించింది. “ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఏర్పడిన అధిక చమురు, ఆహార ధరలు ప్రజల వాస్తవ ఆదాయాలపై బలమైన ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి” అని ప్రపంచ బ్యాంక్ దక్షిణాసియా వైస్ ప్రెసిడెంట్ హార్ట్‌విగ్ షాఫెర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచ బ్యాంక్ పాకిస్తాన్ వృద్ధి అంచనాను పెంచింది.
ఇంధన దిగుమతులపై ఆధారపడటం వలన అధిక ముడి చమురు ధరలు ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేస్తాయని పేర్కొంది. దాదాపు రెండు సంవత్సరాల మహమ్మారి ఆంక్షాల తర్వాత ఆర్థిక వృద్ధిని పునరుద్ధరించడం కంటే ద్రవ్యోల్బణంపై దృష్టి సారించాలని సూచించింది. ప్రపంచ బ్యాంక్ ఈ సంవత్సరం మాల్దీవుల వృద్ధి అంచనాను 11% నుంచి 7.6%కి తగ్గించింది. ముడి చమురు దిగుమతులతోపాటు పర్యాటక రంగాల రాకపోకలు మందగించాయని వివరించింది. సంక్షోభంలో ఉన్న శ్రీలంక 2022-23 వృద్ధి అంచనాను 2.1 నుంచి 2.4%కి పెంచింది.