Hyderabad: స్నేహితులతో స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు.. శవమై తేలాడు.. మిస్టరీగా మారిన విద్యార్థి మృతి

|

Sep 18, 2022 | 8:30 PM

24ఏళ్ల సయ్యిద్‌ సమీయుద్దీన్‌.. స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ చనిపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. ఇంజనీరింగ్‌ కంప్లీంట్‌ చేసిన సయ్యిద్‌

Hyderabad: స్నేహితులతో స్విమ్మింగ్ పూల్‌కి వెళ్లాడు.. శవమై తేలాడు.. మిస్టరీగా మారిన విద్యార్థి మృతి
Hyderabad
Follow us on

Student dies after falling into swimming pool: హైదరాబాద్‌ పాతబస్తీలో ఓ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. చాంద్రాయణగుట్టలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మరణించడం స్థానికంగా ఉద్రిక్తత రేపింది. 24ఏళ్ల సయ్యిద్‌ సమీయుద్దీన్‌.. స్విమ్మింగ్‌ పూల్‌లో ఈతకొడుతూ చనిపోవడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. ఇంజనీరింగ్‌ కంప్లీంట్‌ చేసిన సయ్యిద్‌ సమీయుద్దీన్‌.. ఈ ఉదయం ఫ్రెండ్స్‌తో కలిసి బార్కస్ బెల్ వెయిల్స్ స్విమ్మింగ్ పూల్ కి వెళ్లాడు. మొత్తం పది మంది కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లోకి దిగారు. స్విమ్మింగ్‌ తర్వాత ఫ్రెండ్స్‌ అంతా బయటికి రాగా, సమీయుద్దీన్‌ మాత్రం పూల్‌లోనే శవమై తేలాడు.

సమీయుద్దీన్‌ డెత్‌ ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. కేవలం 5 ఫీట్ల లోతు మాత్రమే ఉన్న ప్రాంతంలో ఎలా చనిపోయాడనేది మిస్టరీగా మారింది. స్విమ్మింగ్‌ పూల్ నిర్వాహకుల లోపమా? లేక ఫ్రెండ్స్‌ కుట్ర ఏమైనా ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. స్విమ్మింగ్‌ పూల్‌లోని సీసీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు.

స్విమ్మింగ్‌ పూల్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే సమీయుద్దీన్‌ చనిపోయాడంటూ కంప్లైంట్‌ ఇచ్చారు కుటుంబ సభ్యులు. సమీయుద్దీన్‌కు ఈత రాదని, నిర్వాహకుల పర్యవేక్షణ లేకపోవడం వల్లే సమీయుద్దీన్‌ చనిపోయాడని సోదరుడు పేర్కొంటున్నాడు.

ఇవి కూడా చదవండి

కాగా.. హైదరాబాద్‌లో స్విమ్మింగ్‌ పూల్ డెత్స్‌ పెరిగిపోతున్నాయ్‌. ఇప్పటివరకు పిల్లలు మాత్రమే మృత్యువాత పడగా, ఇప్పుడు యువకుడు మరణించడం కలకలం రేపుతోంది. డబ్బే లక్ష్యంగా స్విమ్మింగ్‌ పూల్స్‌ను తెరుస్తున్న నిర్వాహకులు… భద్రతను మాత్రం గాలికొదిలేస్తున్నారు. సరైన సౌకర్యాలు లేకపోవడంతో, పర్యవేక్షణ లోపం, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే అధిక శాతం మృత్యువాత పడుతున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం క్లిక్ చేయండి..