పట్టుబట్టి సాహస యాత్ర మొదలు పెట్టాడు.. అనుకున్నది సాధించాడు.. ఎవరెస్ట్ అధిరోహించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
ప్రపంచంలోనే ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహిచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మీర్‌పేట్‌కు చెందిన సందీప్(28) ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించాడు.
Software Engineer climbed Mount Everest : అది మౌంట్ ఎవరెస్ట్.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం. అతి తక్కువ సమయంలో ఏడు ఖండాల్లో ఏడు ఎత్తైన పర్వతాలు అధిరోహించి ప్రపంచ రికార్డు సృష్టించిన దివంగత మల్లి మస్తాన్‌బాబు స్ఫూర్తితో అతను కూడా మౌంటెనీర్ కావాలనుకున్నాడు. ప్రపంచంలోనే ఎత్తైన ఏడు పర్వతాలను అధిరోహిచడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. మీర్‌పేట్‌కు చెందిన సందీప్(28) ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించాడు.
రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం మీర్‌పేట్‌లోని టీఆర్‌ఆర్ టౌన్‌షిప్‌నకు చెందిన వేముల సందీప్ బీటెక్ పూర్తి చేసి హైటెక్ సిటీలోని ఏడీపీ(ఆటోమేటిక్ డేటా ప్రాసెసింగ్) సంస్థలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి సాహసకృత్యాలే ఊపిరిగా గ్రామాల్లో మామూలు కొండలు, గుట్టలు ఎక్కుతూ అందరి మన్ననలు పొందాడు. ఎప్పటికైనా ప్రపంచంలోని ఏడు ఎత్తైన శిఖరాలను అధిరోహించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గతేడాదే తన సాహసయాత్రను మొదలుపెట్టాలని భావించినప్పటికీ కరోనా కారణంగా విరమించుకున్నాడు. తాజాగా పర్వతశ్రేణులు ఎక్కి ఈ ఘనత సొంతం చేసుకున్నాడు.
ఈ నెల 4న 5,364 మీటర్ల ఎత్తైన ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను అధిరోహించడానికి సాహసయాత్రను మొదలు పెట్టిన సందీప్ ఏడు రోజుల్లో బేస్ క్యాంప్‌నకు చేరుకుని జాతీయ పతాకాన్ని ఎగురవేశాడు. తిరిగి మూడు రోజుల్లో కిందకు చేరుకున్నాడు. ఈ మొత్తం 10 రోజుల సాహసయాత్రలో మైనస్ 18 డిగ్రీల ఉష్ణోగ్రతను తట్టుకుని, ఎలాంటి మెడిసిన్ వాడకుండా దిగ్విజయంగా యాత్రను పూర్తి చేశానని సందీప్ చెప్పాడు. తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే తాను ఈ సాహసయాత్రను దిగ్విజయంగా పూర్తి చేయగలిగానని తెలిపాడు. తన తర్వాత టార్గెట్ మౌంట్ కిలిమంజారో అధిరోహించడమని స్పష్టం చేశాడు. ఎప్పటికైనా ప్రపంచంలోని ఎత్తైన ఏడు శిఖరాలను అధిరోహించడమే తన లక్ష్యమని స్పష్టం చేశాడు. సందీప్ తన యాత్రను పూర్తి చేసుకుని మీర్‌పేట్‌కు చేరుకున్నాడు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు ఘన స్వాగతం పలికి అభినందించారు.
Read Also… Jio Plans: జియో నుంచి అదిరిపోయే ఆఫర్.. 1 జీబీ డేటాకు కేవలం రూ.3.5 మాత్రమే… పూర్తి వివరాలివే..!