Hyderabad: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. క్షణాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..

|

May 07, 2023 | 10:44 AM

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. వీకెండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతుండగా వెన్నునొప్పి రావడంతో కారులో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం కాసేపటికే కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన..

Hyderabad: క్రికెట్ ఆడుతుండగా గుండెపోటు.. క్షణాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి..
Heart Attack
Follow us on

క్రికెట్ ఆడుతుండగా గుండెపోటుకు గురై ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి చెందాడు. వీకెండ్‌లో స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడుతుండగా వెన్నునొప్పి రావడంతో కారులో విశ్రాంతి తీసుకున్నాడు. అనంతరం కాసేపటికే కారులోనే గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం ఘట్టుపల్లి శివారులోని కేసీఆర్‌ క్రికెట్ స్టేడియంలో శనివారం (మే 6) చోటుచేసుకుంది. మహేశ్వరం ఎస్సై నర్సయ్య తెలిపిన వివరాల ప్రకారం..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామమనికి చెందిన మర్రిపూడి మణికంఠ(26) ఏడాది కాలంగా కూకట్‌పల్లిలో హాస్టల్‌లో ఉంటూ కేబీహెచ్‌పీ కాలనీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. మృతుడి సోదరుడు వెంకటేష్‌ కేబీహెచ్‌పీ కాలనీలో నివాసం ఉంటూ స్టాప్ట్‌వేర్‌ కోర్సులో శిక్షణ తీసుకుంటున్నాడు. మృతుడి సొదరుడు వెంకటేష్‌ మీడియాతో మాట్లాడుతూ..

వారాంతంలో తామిద్దరం మరికొంతమంది స్నేహితులతో కలిసి స్టేడియంలో క్రికెట్ ఆడుతుంటామని తెలిపారు. ఎప్పటిమాదిరిగానే శనివారం ఉదయం ఘట్టుపల్లి శివారులోని స్టేడియంలో క్రికెట్ ఆడడానికి వెళ్లామన్నాడు. మణికంఠ బ్యాటింగ్‌ అనంతరం ఒకే ఓవర్‌ బౌలింగ్‌ వేసి వెన్నునొప్పి వస్తుందంటూ విశ్రాంతి కోసం కారులో పడుకున్నట్లు చెప్పాడు. కాసేపటి తర్వాత వెళ్లి మణికంఠను పిలిచినా పలకకపోవడంతో వెంటనే మహేశ్వరం ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించామన్నారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మణికంఠ మృతి చెందినట్లు నిర్ధారించారని మృతుడి సోదరుడు వెంకటేష్‌ తెలిపారు. మణికంఠ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై నర్సయ్య తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.