Hyderabad: మసాజ్ ముసుగులో పాడుపని.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. అదుపులో ముగ్గురు అమ్మాయిలు

|

Jun 12, 2023 | 6:26 AM

హైదరాబాద్‌లో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముఠాలను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వ్యభిచార నిర్వహిస్తున్న మరో ముఠా పట్టుబడింది.

Hyderabad: మసాజ్ ముసుగులో పాడుపని.. గుట్టురట్టు చేసిన పోలీసులు.. అదుపులో ముగ్గురు అమ్మాయిలు
Spa Centre (representative Image)
Follow us on

హైదరాబాద్‌లో కొందరు స్పాల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ అమాయకపు యువతులను వ్యభిచార రొంపిలోకి దించుతున్నాయి. ఇప్పటికే ఇలాంటి ముఠాలను పట్టుకుని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా వ్యభిచార నిర్వహిస్తున్న మరో ముఠా పట్టుబడింది. కొందరు వ్యక్తులు ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. ఆడవాళ్లను బలవంతంగా వ్యభిచార కూపంలోకి లాగి డబ్బులు దండుకుంటున్నారు. చాలా చోట్ల ఇలాంటి అక్రమ వ్యాపారాలు కొనసాగుతున్నాయి. అమాయకమైన అమ్మాయిలను తమ వలలో వేసుకుని వారిని తీసుకు వచ్చి వ్యభిచార ముఠాలకు విక్రయించి అందినకాడికి డబ్బును దండుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్‌లో గుట్టుగా సాగుతున్న వ్యభిచారాన్ని మరోసారి రట్టు చేశారు పోలీసులు. స్పా ముసుగులో సీక్రెట్ గా సాగుతున్న దందాను బట్టబయలు చేశారు. ఐ.ఎస్.సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సెన్సాషల్ స్పా సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. ముగ్గురు మహిళలతో అసాంఘిక కార్యక్రమలకు పాల్పడుతున్నారనే సమాచారంతో స్పా సెంటర్ పై దాడి చేశారు. ఓ మహిళ నిర్వహకురాలితో పాటు ముగ్గురు మహిళలు ముగ్గురు కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గరి నుంచి 8 సెల్ ఫోన్లు,3వేల 300 నగదు స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం విచారణ నిమిత్తం ఐ.ఎస్.సదన్ పోలీసులకు అప్పగించారు. ఉద్యోగాలకోసం వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే యువతులకు ఎక్కువ జీతాలను ఆశ చూపి వ్యభిచారం చేయిస్తున్నారు కొందరు స్పా నిర్వాహకులు. ఇటువంటి చర్యల వల్ల ఎంతో మంది యువతులు.. తమ జీవితాలను ప్రమాదంలోకి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి వ్యభిచార ముఠాలను పోలీసులు ఎప్పటికప్పుడు పట్టుకుని అరెస్ట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం  క్లిక్ చేయండి..