Hyderabad: స్పా సెంటర్ల పేరిట చీకటి వ్యాపారం.. ఆరుగురు యువతులను రక్షించిన పోలీసులు

|

Mar 06, 2022 | 9:03 AM

Hyderabad Police Raids On SPA Centers: హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. స్పా సెంటర్ల తనిఖీల్లో కళ్లు బైర్లుకమ్మే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి.

Hyderabad: స్పా సెంటర్ల పేరిట చీకటి వ్యాపారం.. ఆరుగురు యువతులను రక్షించిన పోలీసులు
Spa
Follow us on

Hyderabad Police Raids On SPA Centers: హైదరాబాద్ నగరంలో అక్రమంగా నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. స్పా సెంటర్ల తనిఖీల్లో కళ్లు బైర్లుకమ్మే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి మసాజ్‌ పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న రెండు స్పా సెంటర్లపై తాజాగా పోలీసులు దాడులు చేసి ఆరుగురు యువతులను రక్షించారు. నారాయణగూడ పరిధిలోని స్పా సెంటర్లపై శనివారం దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఎలైట్, ది మాంక్ స్పాపై దాడులు చేసి.. ఆరుగురు అమ్మాయిలను రక్షించినట్లు పోలీసులు తెలిపారు. దీంతోపాటు ఏడుగురు కస్టమర్లు, నలుగురు మేనేజర్లను అరెస్టు చేశారు. ఆ తర్వాత నిబంధనలను ఉల్లంఘిస్తున్న రెండు స్పా సెంటర్లను సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. స్పా సెంటర్లలో పలు ఆధారాలను స్వాధీనం చేసుకున్నామని.. యజమానులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.

పక్కా సమాచారంతో నారాయణగూడ పోలీసు బృందం హైదర్‌గూడలోని ఒక స్పాపై దాడి చేసి ఇద్దరు మేనేజర్లు, ముగ్గురు కస్టమర్లను పట్టుకున్నారు. అక్కడ పనిచేస్తున్న ముగ్గురు మహిళలను రక్షించారు. యజమాని తాజుద్దీన్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. హిమాయత్‌నగర్‌లోని మరో స్పాలో ఇద్దరు మేనేజర్లు, నలుగురు కస్టమర్లను పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు మహిళలను రక్షించారు. యజమాని సిరాజ్ పరారీలో ఉన్నాడని పేర్కొన్నారు. మసాజ్‌ సెంటర్ల పేరిట నిర్వహిస్తున్న చీకటి కార్యకలాపాల గురించి ప్రస్తుతం నగరంలో చర్చనీయాంశంగా మారింది.

Also Read:

AP News: కృష్ణా జిల్లాలో విషాదం.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి..

East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు…