AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP News: కృష్ణా జిల్లాలో విషాదం.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి..

Two women killed by cat bite: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా..

AP News: కృష్ణా జిల్లాలో విషాదం.. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి..
Cat
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2022 | 8:36 AM

Share

Two women killed by cat bite: ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతిచెందారు. రెండు నెలల క్రితం ఇద్దరు మహిళలను పిల్లి కరవగా.. వారిద్దరు ఒకే రోజున మరణించిన దుర్ఘటన శనివారం జిల్లాలోని మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది. వేములమడలోని విశ్రాంత కండక్టర్‌ సాలి భాగ్యారావు భార్య కమలను, ప్రైవేటు వైద్యుడు బొడ్డు బాబూరావు భార్య నాగమణిని రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. అయితే.. వారిద్దరూ వైద్యుల సలహా మేరకు టీటీ ఇంజక్షన్లు చేయించుకొని గాయాలు తగ్గడానికి మందులు వాడారు. అనంతరం కొద్ది రోజులకు గాయాల నుంచి ఉపశమనం కలిగింది. అయితే.. గాయం పూర్తిగా మానిన తర్వాత నాలుగు రోజుల క్రితం మళ్లీ ఇద్దరికీ అనారోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కమల మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆసుపత్రిలో.. నాగమణి విజయవాడలోని ఓ ఆసుపత్రిలో శుక్రవారం చేరారు. ఈ క్రమంలో నాగమణి శనివారం తెల్లవారుజామున చికిత్స పొందుతూ మృతి చెందింది. కమల కూడా శనివారం ఉదయం10 గంటలకు మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

అయితే.. పిల్లి కరవడంతో ఇద్దరు మహిళలకు ర్యాబిస్‌ సోకినట్లు వైద్యులు తెలిపారు. వారిని కరిచిన పిల్లి కుక్కకాటుకు గురై మరణించినట్లు వెల్లడించారు. పిల్లి, కుక్క, ఎలుక, పాము లాంటి జంతువులు కరిస్తే వెంటనే సమీప ఆరోగ్య కేంద్రాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని స్థానిక ప్రభుత్వ వైద్యులు సూచించారు. కాగా.. ఇద్దరు మహిళలు పిల్లి కరిచిన రెండు నెలల తర్వాత ఒకే రోజు చనిపోవడంతో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read:

East Godavari: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తపై దుండగులు దాడి.. గతంలో ఎమ్మెల్యే రాపాక నుంచి ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదు…

Russia Ukraine War: మహిళా పైలెట్లతో పుతిన్ సమావేశం.. ఉక్రెయిన్‌పై యుద్ధంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..