Hyderabad: కరోనా విలయతాండవం.. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్యులకు పాజటివ్..

Doctors Tested Covid-19: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి

Hyderabad: కరోనా విలయతాండవం.. గాంధీ ఆస్పత్రిలో 44 మంది వైద్యులకు పాజటివ్..
Doctors
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jan 11, 2022 | 6:00 PM

Doctors Tested Covid-19: దేశంలో కరోనా మహమ్మారి (Coronavirus) విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు నమోదవుతున్నాయి. సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. దీంతోపాటు.. కరోనా విపత్కర పరిస్థితుల్లో చికిత్స అందించే వైద్యులు కూడా కరోనావైరస్ బారిన పడుతున్నారు. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో వందలాది మంది వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడ్డారు. ఈ క్రమంలో తెలగాణ రాజధాని హైదరాబాద్‌ (Hyderabad) సైతం వైద్యులు కరోనా బారిన పడ్డారు. భారీ ఎత్తున వైద్యులు, వైద్య విద్యార్దులు కరోనా బారినపడుతున్నారు.

హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో (Gandhi Hospital) 30 మండి మెడికోలకు కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరితోపాటు 10 పీజీలకు, నలుగురు ప్రొఫెసర్లకు కరోనా సోకింది. అంతేకాకుండా ఉస్మానియాలో 50మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కాగా.. కాకతీయ మెడికల్‌ కళాశాలలో 30మంది మెడికోలు కరోనా బారినపడ్డారు. నిమ్స్‌లో 60 మందికిపై వైద్యులు, వైద్య విద్యార్దులకు కరోనా సోకినట్లు పేర్కొంటున్నారు. థర్డ్ వేవ్ ఎక్కువగా ప్రభావం చూపిస్తోందని వైద్యలు పేర్కొంటున్నారు. దీంతో వైద్యులు ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. కాగా పెద్ద ఎత్తున వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి కరోనా సోకడం అంతటా ఆందోళన కలిగిస్తోంది.

పెద్ద ఎత్తున వైద్యులు కరోనా బారిన పడుతుండటంతో.. ఆసుపత్రుల్లో సేవలకు అంతరాయం కలుగుతున్నట్లు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సేవలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు చేపట్టినట్లు సమాచారం.

Also Read:

AP Covid-19: ఏపీలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి.. ఆ ఏడు జిల్లాల్లో భారీగా పెరిగిన కేసులు..

Keerthy Suresh: సినిమా ఇండస్ట్రీని వదలనంటున్న కరోనా.. అందాల భామ కీర్తిసురేష్ కు పాజిటివ్..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే