Hyderabad: వామ్మో.. స్విగ్గీలో కండోమ్‌ల కోసం ఇన్ని కోట్లా ఆర్డర్లా.! రిపోర్టు చూస్తే బిత్తరపోతారు

|

Dec 29, 2024 | 7:30 AM

ఆటగాళ్లు.. మాంచి ఆటగాళ్లు.. అమ్మబాబోయ్ హైదరాబాదీలు ఆ విషయంలోనూ తగ్గేదేలే అన్నారుగా.. ఈ రిపోర్ట్ చూస్తె మీరు నోరెళ్ళబెట్టడం ఖాయం. స్విగ్గీ మార్ట్ ఈ ఏడాది హైదరాబాదీలు ఎన్ని ఆర్డర్లు.. ఏయే ఐటమ్స్ ఆర్డర్ చేశారో నివేదిక విడుదల చేసింది. అదేంటంటే

Hyderabad: వామ్మో.. స్విగ్గీలో కండోమ్‌ల కోసం ఇన్ని కోట్లా ఆర్డర్లా.! రిపోర్టు చూస్తే బిత్తరపోతారు
Swiggy
Follow us on

ప్రముఖ ఆన్‌లైన్ డెలివరీ యాప్ స్విగ్గీ మార్ట్ తమ వార్షిక రిపోర్టును విడుదల చేసింది. ఈ ఏడాది పొడవునా హైదరాబాదీలు ఏయే ఫుడ్ ఐటమ్స్, ఏయే ప్రొడక్ట్స్‌ని ఆర్డర్ చేశారన్న వివరాలను వెల్లడించింది. మ్యాగీ నుంచి మిల్క్ ప్యాకెట్ వరకు.. కొత్తిమీర నుంచి కండోమ్స్ వరకు.. ఐస్‌క్రీమ్ నుంచి అండర్ వేర్ వరకు అన్నింటికీ హైదరాబాదీలు ఎక్కువగా స్విగ్గీనే ఉపయోగించారట. హైదరాబాద్ ప్రజలు ఈ ఏడాదిలో ఏకంగా 25 మిలియన్లకు పైగా మ్యాగీ ప్యాకెట్లను ఆర్డర్ చేశారట. అలాగే 2 కోట్ల చిప్స్ ప్యాకెట్లను ఆర్డర్ చేసినట్టు స్విగ్గీ వెల్లడించింది.

ఇక అత్యధికంగా నగరంలో ఫుడ్ ఆర్డర్లలో పాల ఉత్పత్తులు 19 లక్షలకు పైగా ఆర్డర్లు ఉన్నాయని తెలిపింది. ఇవే కాకుండా.. టమాటాలు, ఉల్లిపాయలు, కొత్తిమీరా, పచ్చిమిర్చి లాంటి కూరగాయలను నగర ప్రజలు స్విగ్గీ మార్ట్ నుంచి ఆర్డర్ పెట్టారట. అలాగే దాదాపుగా 2 లక్షల కండోమ్‌లను బుక్ చేసినట్టు పేర్కొంది. అటు లోదుస్తుల కోసం 18 వేల ఆర్డర్లు వచ్చినట్టు తమ నివేదికలో స్విగ్గీ మార్ట్ పేర్కొంది. మరోవైపు హైదరాబాదీలు ఈ ఏడాది కేవలం ఐస్‌క్రీమ్‌లకే దాదాపు రూ. 31 కోట్లు, బ్యూటీ ప్రొడక్ట్స్‌కు రూ. 15 కోట్లు ఖర్చు చేశారని తెలిపింది.

ఇది చదవండి: పొలంలో సేద్యం చేస్తుండగా మెరుస్తూ కనిపించిన వస్తువు.. ఏంటా అని రైతులు వెళ్లి చూడగా

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి