Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతూ.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. శిక్షలు విధిస్తున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.. తాజాగా.. హైదరాబాద్‌ నగరం పరిధిలో మరో దారుణం చేసుకుంది..

Hyderabad: హైదరాబాద్‌లో మరో ఘోరం.. ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం..!
Crime News (representative image)
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 24, 2025 | 7:29 AM

నిర్భయ లాంటి కఠిన చట్టాలున్నప్పటికీ.. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు ఆగడం లేదు.. కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతూ.. దారుణాలకు పాల్పడుతున్నారు.. ఎప్పటికప్పుడు కఠిన చర్యలు తీసుకుంటున్నా.. శిక్షలు విధిస్తున్నా.. నేరాలు మాత్రం ఆగడం లేదు.. తాజాగా.. హైదరాబాద్‌ నగరం పరిధిలో మరో దారుణం చేసుకుంది.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్‌లో యువతిపై అత్యాచారయత్నం జరిగింది.. ఈ ఘటన సంచలనంగా మారింది.. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటిఎస్ ట్రైన్‌లో ఒంటరిగా ఉన్న యువతిపై ఓ దుండగుడు అత్యాచారయత్నం చేశాడు.. దీంతో యువతి అతన్ని ప్రతిఘటించి.. కదులుతున్న ట్రైన్‌లో నుంచి ఒక్కసారిగా దూకేసింది.. దీంతో యువతికి తీవ్రగాయాలయ్యాయి.  తీవ్రగాయాలపాలైన ఆ యువతిని పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న సికింద్రాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. దుండగుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి..

వివరాల ప్రకారం..

మేడ్చల్‌లోని హాస్టల్‌లో ఉంటున్న ఆ యువతి సెల్‌ఫోన్‌ పాడవడంతో సికింద్రాబాద్‌ వచ్చింది. సెల్‌ఫోన్‌ బాగుచేయించుకున్న తర్వాత తిరిగి ఎంఎంటీఎస్‌లో మేడ్చల్‌ బయల్దేరింది. మహిళల కోచ్‌లో తనతోపాటు ఉన్న మరో ఇద్దరు మహిళలు అల్వాల్‌లో దిగిపోయారు. కాసేపట్లో మేడ్చల్‌ వస్తుందన్న సమయంలో ఓ దుండగుడు ఆ కోచ్‌లోకి ప్రవేశించి ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. అతడి నుంచి తప్పించుకునేందుకు ఆ యువతి కదులుతున్న ట్రైన్‌లో నుంచి దూకేసింది. ఆమెకు తీవ్ర గాయాలవడంతో జీఆర్పీ పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజీల ఆధారంగా దుండగుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు పోలీసులు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..